AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Plant: తేయాకును కొండ ప్రాంతాల్లోనే ఎందుకు పండిస్తారు..? అసోం టీ ప్రత్యేకత ఏమిటి..?

Tea Plant: చాలా మంది రోజు తాగే పానీయం టీ. అయితే టీ తయారు చేసేందుకు ఉపయోగించేది తేయాకు. ఇది అన్ని ప్రాంతాల్లో పండించడం కుదరదు. ఏటవాలుగా ఉన్న కొండ ప్రాంతాల్లో..

Tea Plant: తేయాకును కొండ ప్రాంతాల్లోనే ఎందుకు పండిస్తారు..? అసోం టీ ప్రత్యేకత ఏమిటి..?
Subhash Goud
|

Updated on: Feb 09, 2021 | 5:51 PM

Share

Tea Plant: చాలా మంది రోజు తాగే పానీయం టీ. అయితే టీ తయారు చేసేందుకు ఉపయోగించేది తేయాకు. ఇది అన్ని ప్రాంతాల్లో పండించడం కుదరదు. ఏటవాలుగా ఉన్న కొండ ప్రాంతాల్లో మాత్రమే తేయాకును పండిస్తారు. తేయాకు తోటల్లో పని చేసే మహిళా కార్మికులు ఆకులను కోసి, వీపు మీద ఓ బుట్టలో వేసుకోవడం సాధారణంగా సినిమాల్లో చూస్తూనే ఉంటాము. టీ తోటలను కొండ ప్రాంతాల్లో పెంచుతారని తెలిసే ఉంటుంది. కొండ ప్రాంతాల్లోనే ఎందుకు పెంచుతారో చూద్దాం.

తేయాకు పంటకు సరైన వర్షపాతం అవసరం. కానీ నీరు నిల్వ ఉండకూడదు. అందుకే ఏటవాలుగా ఉన్న కొండ ప్రాంతాలలో తేయాకును పండిస్తుంటారు. మన దేశంలో అసోం రాష్ట్రంలో ఎక్కువగా తేయాకును పండిస్తారు. దక్షిణ భారతదేశంలోని కేరళ, నీలగిరి కొండల్లో కూడా తేయాకును పండిస్తుంటారు. ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో, ఎగుమతిలో అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి.

అసోం టీ ఇదో బ్లాక్‌ టీ భారతదేశంలోని అసోంలోని ప్రాంతం పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. బంగ్లాదేశ్‌, బర్మా సరిహద్దుల్లో బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో ఉన్న అసోం ప్రపంచంలోనే అత్యధికంగా చాయ్‌ పొడి తోటలను పండించే ప్రదేశంగా పేరొందింది. ఈ ప్రాంతంలో ఎక్కువ అర్ధత ఉండటంతో పాటు వర్షాకాలంలో రోజుకు రూ.10-12 అంగుళాల (250-300మి.మీ) వర్షపాతం నమోదు అవుతుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు 103 ఫారెన్‌ హీట్‌ (40 డిగ్రీ సెంటీ గ్రేడ్‌) వరకు ఉండటంతో ఎక్కువ వేడి, తేమ నెలకొని గ్రీన్‌ హవుస్‌ లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ తరహా వాతావరణ పరిస్థితులు అసోం ‘టీ’కి విశిష్ట రుచిని అపాదించాయి. అసోం చాయ్‌ని కామేలియా సినెన్సిస్‌ వార్‌ అస్సామికా అనే మొక్క ద్వారా రూపొందుతుంది. సముద్రమట్టం ఎత్తులో పండించే ఈ తేనీరు విశిష్ట రుచి, సువాసన, పొడి బారుతనం, గాఢత్వానికి ప్రసిద్ధి. అసోం టీ లేదా దాని ఉత్పత్తులను అల్పాహార టీ గా విక్రయిస్తారు. దీనిని ఇంగ్లీష్‌ బ్రేక్‌ ఫాస్ట్‌ టీ, ఐరిష్‌ బ్రేక్‌ ఫాస్ట్‌ టీ, స్కాటిష్‌ బ్రేక్‌ ఫాస్ట్‌ టీ అని కూడా పిలుస్తారు. ప్రధానంగా అసోం బ్లాక్‌ టీకి ప్రసిద్ది. కానీ ఇక్కడ దీంతో పాటు గ్రీన్‌, వైట్‌ టీలను కూడా కొద్ది మొత్తంలో పండిస్తారు. వీటి రుచులు వీటికి ప్రత్యేకం.

చారిత్రకంగా చూస్తే టీ పొడి ఉత్పత్తులలో దక్షిణ చైనా తర్వాత అసోందే రెండో స్థానం. ప్రపంచంలో దక్షిణ చైనా, అసోం ఈ రెండు ప్రాంతాలు మాత్రమే స్థానిక టీ మొక్కలకు ప్రసిద్ది. 19వ శతాబ్దంలో చాయ్‌ తాగే అలవాట్లలో అసోం టీ విస్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది.

Also Read: Guava Health Benefits: జామతో బోలెడు ప్రయోజనాలు.. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి లాభాలంటే..