ఆందోళన ఆగదు, నాలుగు లక్షలు కాదు, 40 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తాం, రైతు నేత రాకేష్ తికాయత్,
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతుల ఆందోళన దేశవ్యాప్తమవుతుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతుల ఆందోళన దేశవ్యాప్తమవుతుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు.హర్యానా లోని కురుక్షేత్ర జిల్లాలో మంగళవారం జరిగిన కిసాన్ మహా పంచాయత్ లో పాల్గొన్న ఆయన.. ఇక నాలుగు లక్షలు కాదని, 40 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. అక్టోబరు 2 తరువాత కూడా అన్నదాతల నిరసన కొనసాగుతుందని, వారు షిఫ్తుల్లో తమ ప్రొటెస్ట్ సైట్లకు చేరుకుంటారని ఆయన చెప్పారు. తమ ఆందోళన గురించి ప్రధాని మోదీ ‘ఆందోళన్ జీవి’ అని వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావించిన ఆయన.. ప్రధాని తన జీవితంలో ఎన్నడూ ఆందోళనలో పాల్గొనలేదన్నారు. మోదీ ఈ దేశాన్ని విభజించే పనిలో ఉన్నారని తికాయత్ ఆరోపించారు. అసలు ఆందోళన్ జీవి అంటే ఏమిటో మోదీకి తెలుసా అని ప్రశ్నించారు.
భగత్ సింగ్. లాల్ కృష్ణ అద్వానీ సైతం ఒకప్పుడు ఆందోళనల్లో పాల్గొన్నారని రాకేష్ తికాయత్ గుర్తు చేశారు. తమ నిరసనను ప్రభుత్వం చులకన చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. రైతు చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండులో మార్పు ఉండబోదన్నారు.
Read More:చమోలీ ఘటనకు రేడియో యాక్టివ్ పరికరమే కారణమా ? రైనీ గ్రామస్తుల్లో వెల్లువెత్తుతున్న అనుమానాలు