AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Panchayat Elections Result 2021: కొనసాగుతోన్న ఏపీ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం..

AP Sarpanch Elections result: ఎన్నో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మొదలైన ఏపీ పంచాయతీ ఎన్నికలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ పూర్తికాగా.. ఓట్ల లెక్కింపు మొదలైంది...

AP Panchayat Elections Result 2021: కొనసాగుతోన్న ఏపీ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం..
Narender Vaitla
|

Updated on: Feb 09, 2021 | 7:57 PM

Share

AP Sarpanch Elections result: ఎన్నో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మొదలైన ఏపీ పంచాయతీ ఎన్నికలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ పూర్తికాగా.. ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా అందిన సమాచారం మేరకే ఏ జిల్లాలో ఎవరెవరు విజయం సాధించారో ఓసారి చూద్దాం.. ఓట్ల లెక్కింపు మొదలు పెట్టగానే కాంగ్రెస్‌ పార్టీ మద్ధతుతో పోటీచేసిన సర్పంచ్‌ అభ్యర్థి లలితా భాస్కర్‌ గెలుపొందారు. వెదురుకుప్పం మండలం మొండి వెంకయ్య పల్లె పంచాయితీ సర్పంచ్ గా లలిత విజయం సాధించారు. ఇక కర్నూలు జిల్లా విషయానికొస్తే.. చిన్నవంగలి గ్రామ సర్పంచిగా మౌలిభాషా గెలుపొందారు. మునగాల సర్పంచిగా మునగాల లోకేశ్‌రెడ్డి, రాయమల్పురం సర్పంచిగా పార్వతమ్మ గెలుపొందారు. ప్రకాశం జిల్లాకు చెందిన లింగంగుంట సర్పంచిగా తూమాటి కల్యాణి విజయం సాధించగా.. సీతారాంపురం సర్పంచిగా మండవ శివానందరావు గెలుపొందారు. వెలగపూడి సర్పంచిగా వెలగపూడి సర్పంచిగా కృష్ణారావు, పాతపాడులో సర్పంచిగా కోదండరామిరెడ్డి విజయం పొందారు. ఇక కడప జిల్లా కొర్రపాటిపల్లె సర్పంచిగా కాసాలక్ష్మీ విజయం సాధించారు. నెల్లూరు జిల్లా విషయానికొస్తే.. ఎరుకులరెడ్డిపాలెం సర్పంచిగా మేకల విజయలక్ష్మి గెలిచారు.

చిత్తూరు జిల్లాలో..

కొండ్రాజుకాల్వ సర్పంచిగా పరంధామనాయుడు గెలుపొందారు.. చీకూరుపల్లి – అమరావతి కరిడివారిపల్లి – ఆశ బొమ్మాయిపల్లె – గౌరమ్మ మంగళపల్లి – మురళి

కడప జిల్లాలో..

తుడుములదిన్నె – కృష్ణారెడ్డి తంగేడుపల్లె – లక్ష్మీదేవి గెలుపు

విశాఖ జిల్లాలో..

కన్నంపాలెం – బర్ల తాతాలు లైన్ కొత్తూరు – కొల్లు రహానే ఎల్. సింగవరం – వేపాడ మనీషా పాపయ్యపాలెం – తలారి సత్యనారాయణ

కర్నూలు జిల్లాలో..

పాండురంగపురం – డోలావతమ్మ పులిమద్ది – రఘురామరెడ్డి

ప్రకాశం జిల్లాలో..

సీతారామపురం – శివానందరావు రాజుపాలెం – గర్నెపూడి కోటమ్మ

ఇక ఒంగోలు జిల్లాలోని దేవరంపాడు సర్పించిగా నన్నపనేని వెకంటేశ్వర్లు విజయం సాధించగా, గుంటూరులోని కోతివానిపాలెంలో కామేపల్లి పద్మావతి గెలుపొందారు. అలాగే కృష్ణా జిల్లోని జగన్నాథపురం సర్పంచిగా బండి విజయ్‌పాల్‌రెడ్డి గెలుపొందారు.

Also Read: AP Panchayat Election Results 2021 LIVE: ఏపీలో ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్