AP Local Body Elections: పద్ధతి మార్చుకోండి.. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ పోలీసులపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోసారి ధ్వజమెత్తారు.

AP Local Body Elections: పద్ధతి మార్చుకోండి.. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..
AP Local Body Elections
Follow us

|

Updated on: Feb 09, 2021 | 7:20 PM

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ పోలీసులపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోసారి ధ్వజమెత్తారు. పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆయన.. తీరు మార్చుకోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ పాలన పోలీసు వ్యవస్థకు మాయని మచ్చ అని దుయ్యబట్టారు. రాజకీయ ఒత్తిడికి తలొగ్గి అక్రమ కేసులు పెడుతున్నారని, ఇది హేయమైన చర్య అని దుయ్యబట్టారు.

టీడీపీ బలపర్చిన అభ్యర్థిని వెతకడానికి వెళ్లిన కొల్లు రవీంద్రపై కేసు పెట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. నిజా నిజాలను తొక్కిపెట్టి.. చట్టాన్ని నీరుగారుస్తున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. పొట్లపాలెం సర్పంచి అభ్యర్థి అదృశ్యంపై ఎందుకు కేసు నమోదు చేయలేదని పోలీసులను చంద్రబాబు ప్రశ్నించారు. అధికార పార్టీకి పోలీసులు దాసోహమయ్యారని, తాజాగా నమోదైన కేసులో ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలని హితవు చెప్పిన చంద్రబాబు.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Also read:

AP Panchayat Election Results 2021: ఏపీలో ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌.. ప్రారంభమైన కౌంటింగ్‌..

AP Panchayat Elections 2021 : పడతికి పట్టం కట్టిన పల్లె.. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు అందరూ అతివలే.. ఇదెక్కడంటే..!