Bank Employees Strike: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. యూనియన్ల సమ్మె.. ఆ రెండు రోజులు బ్యాంక్స్ బంద్..
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ఆ రెండు రోజులు బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ UFBU సమ్మె చేస్తామని హెచ్చరించారు.

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ఆ రెండు రోజులు బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ UFBU సమ్మె చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆ బ్యాంకులు రెండు రోజుల వరకు ఎలాంటి లావాదేవీలు జరగవు. యూఎఫ్బీయూలో దాదాపు 9 యూనిట్లు ఉంటాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండడంతో.. తాము మార్చి 15 నుంచి సమ్మె చేయనున్నట్లుగా యూఎఫ్బీయూ స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయనున్నట్లుగా 2021 బడ్జెట్లో ప్రకటించింది. దీంతో బ్యాంక్ యూనియన్లు ఆ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించింది. ఎల్ఐసీ ఈ బ్యాంకును కొనుగోలు చేసింది. గత 4 ఏళ్ళలో కేంద్రం 14 బ్యాంకులను విలీనం చేసింది. మంగళవారం జరిగిన యూఎఫ్బీయూ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తాము అంగీకరించడం లేదని… అందుకే రెండు రోజులపాటు సమ్మె చేయనున్నట్లుగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ AIBEA జనరల్ సెక్రటరీ హీహెచ్ వెంకటచలం తెలిపారు. ఈ కారణాంగా మార్చి 15, 16 తేదీలలో బ్యాంకులు పనిచేయవు. అందువలన కస్టమర్లు ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Also Read: ఐసీఐసీఐ మొబైల్ యాప్లో కీలక మార్పు.. ఇతర బ్యాంకుల కస్టమర్లకు ఇకపై అందుబాటులోకి.