Teddy Day 2021: హ్యాపీ ‘టెడ్డీ డే’.. టెడ్డీ బేర్స్‏తోపాటు అందమైన కోట్స్‏తో మీ ప్రేమను తెలియజేయండిలా..

సాధరణంగా అమ్మాయిలు టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. అందుకు కారణం మాత్రం ఉండదు. టెడ్డీ వాళ్ల పక్కన

Teddy Day 2021: హ్యాపీ 'టెడ్డీ డే'.. టెడ్డీ బేర్స్‏తోపాటు అందమైన కోట్స్‏తో మీ ప్రేమను తెలియజేయండిలా..
Follow us

|

Updated on: Feb 10, 2021 | 11:42 AM

Velentine Week Special Teddy Day: సాధరణంగా అమ్మాయిలు టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. అందుకు కారణం మాత్రం ఉండదు. టెడ్డీ వాళ్ల పక్కన ఉంటేచాలు ఒంటరిగా ఉన్నామనే భావన వారిలో ఉండదు. చెప్పుకోలేని బాధలైన.. సంతోషాలైన.. మనసులోని భావాలన్నింటిని చెప్పుకొవడానికి వాళ్ళకి ఉన్న బేస్ట్ ఫ్రేండ్స్.. ఆ టెడ్డీయే. అందుకే మీ ప్రేయసికి ఒక అందమైన టెడ్డీని బహుమతిగా అందించండి.

కేవలం అమ్మాయిలకు మాత్రమే కాదు.. మనందరికీ టెడ్డీ బేర్స్‌తో అనేక రకాల జ్ఞాపకాలు ఉంటాయి. చిన్నతనంలో బంధువులు, సన్నిహితులు ఎవరో ఒకరు వీటిని మనకు బహుమతులుగా ఇస్తూనే ఉంటారు. కొన్ని టెడ్డీలతో మనకు విడదీయలేని సంబంధాన్ని కూడా కలిగి ఉండడం సహజం. దీనికి కారణం, ఆ టెడ్డీ రూపమే కాక, దీనిని బహుమతిగా ఇచ్చే వారి ప్రేమ అందులో కనపడుతుంది కాబట్టి. కొందరు తమ భావాలను చెప్పుకోవడానికి కూడా తమ టెడ్డీని స్నేహితునిగా భావిస్తుంటారు. అటువంటి టెడ్డీ బేర్ ని బహుమతిగా ఇవ్వడం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. అందుకే కేవలం ప్రేమికులకు మాత్రమే కాదు.. మీ ఆత్మీయులకు, స్నేహితులకు కూడా ఈ టెడ్డీలను అందించండి.

టెడ్డీ బేర్స్ ఎలా పుట్టుకోచ్చాయి..

నిజానికి అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్ ‘టెడ్డీ’ రూస్‌వెల్ట్ గౌరవార్థం ఈ టెడ్డీ బేర్‌ను రూపొందించారు. తాను వేటకు వెళ్లిన ప్రతిసారి ఎలుగుబంటి (బేర్)ను చంపకూడదని రూస్‌వెల్ట్ నిర్ణయించుకున్నారు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ టెడ్డీ బేర్ పుట్టుకొచ్చింది. అమ్మాయిలకు ఈ టెడ్డీ అంటే ఎంతో ఇష్టం కాబట్టి వాలంటైన్స్ వీక్‌లో టెడ్డీ డే వచ్చింది.

రంగు రంగు  టెడ్డీలకు అర్థాలు..

ఎరుపు రంగు టెడ్డీ బేర్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య భావోద్వేగ సంబంధం తీవ్రతను సూచిస్తుందని అంటుంటారు. అందుకే ఎక్కువమంది గులాబీ లేదా ఎరుపు రంగు టెడ్డీ బేర్లను తమవారికి ఇచ్చి.. తమ ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ మీ భాగస్వామి మనస్పూర్తిగా వీటిని స్వీకరిస్తే, మీ ప్రేమను వారు అంగీకరించారని అర్ధం అన్నమాట. అలాగే బ్లూ టెడ్డీని బహుమతిగా ఇస్తే.. మీరు వారిపట్ల చెప్పలేనంత ప్రేమను కలిగి ఉన్నారని అర్థం. ఇవే కాకుండా గ్రీన్ కలర్ టెడ్డీని గిఫ్ట్‏గా ఇస్తే.. వారితో మీకు బలమైన భావోద్వేగ సంబంధాన్ని కోరుకుంటున్నట్లు అర్థమవుతుంది. అలాగే బ్రౌన్ కలర్ టెడ్డీని తీసుకున్నట్లైతే త్వరలో మీరు మీ ప్రేమికుడికి లేదా ప్రేయసికి గుడ్ బై చెప్పబోతున్నారని అర్ధం. అందుకే మీరు టెడ్డీ బేర్ కలర్‏ను ఎంచుకునే ముందు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోండి.

మీకోసం కొన్ని కోట్స్.. 

గత జ్ఞాపకాలకు నిలువుటద్ధం నువ్వు.. నూతన పరిచయాలకు ప్రతీ రూపం నువ్వు.. నాదారిలోని ప్రతీ పరిచయాలు నీకు తెలుసు.. నా కోపం, నా దుఃఖం, సంతోషం అన్నీ నీకు తెలుసు.. నీతో జీవితాంతం కలుసుండాలనుకుంటున్నాను.. హ్యాప్పీ టెడ్డీ డే.. మై లవ్..

నా ఉహలో… నా ఆలోచనలో.. నా కలలో… నా మాటలో… నా నీడలో… నా మనసులో…. ప్రతిచోట నీ ధ్యాసే.. హ్యాప్పీ టెడ్డీ డే..

ఒక్కసారి నీ మనసుతో వినిచూడు.. నా మనసులోని ప్రతీ మాట నీకు సంగీతమై వినిపిస్తుంది.. ఒక్కసారి నీ మనసు కనులు తెరిచి చూడు.. నా కనులు కంటున్న నీ కలల వెలుగు కనిపిస్తుంది.. ఒక్కసారి మనసులో అడుగుపెట్టి చూడు.. నిరంతరం నీ గుండెచప్పుడై ఉంటాను నీకు తోడుగా.. హ్యాప్పీ టెడ్డీ నేస్తామా..

సోట్ట బుగ్గల అమ్మాయి… నీ నవ్వుల్లో ఎన్నో వర్ణాలు… నీకంటూ ఏం ఇవ్వగలను.. నీ ముందు ఆ రోజా కూడా నిలవలేదు.. అందుకే ఈ చిన్ని కానుకగా నా ప్రేమను.. ఈ టెడ్డీగా చేసి ఇస్తున్న… హ్యాప్పీ టెడ్డీ డే..