Eat On A Banana Leaf: పూర్వకాలంలో అరటి ఆకులో భోజనం ఎందుకు పెట్టేవారో తెలుసా..! అరటి ఆకు భోజనంతో ఎన్నిలాభాలో తెలుసా..!

కాలంలో పాటు మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. తినే ఆహారం నుంచి కట్టుకునే బట్టలు పాటించే నియమాలు ఇలా అన్నింటిలోనూ మార్పు చోటు చేసుకున్నాయి. అలాంటి మార్పుల్లో ఒకటి బఫే డిన్నర్.  బంతి భోజనాలప్లేస్ లో ఈ డిన్నర్ అడుగు పెట్టగా..అరటిఆకులో భోజనం స్థానంలో ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్గ్ గ్లాసులు...

Eat On A Banana Leaf: పూర్వకాలంలో అరటి ఆకులో భోజనం ఎందుకు పెట్టేవారో తెలుసా..! అరటి ఆకు భోజనంతో ఎన్నిలాభాలో తెలుసా..!
Banana leaves contain large amounts of polyphenols that are natural antioxidants
Follow us
Surya Kala

|

Updated on: Feb 08, 2021 | 3:04 PM

Eat On A Banana Leaf: కాలంలో పాటు మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. తినే ఆహారం నుంచి కట్టుకునే బట్టలు పాటించే నియమాలు ఇలా అన్నింటిలోనూ మార్పు చోటు చేసుకున్నాయి. అలాంటి మార్పుల్లో ఒకటి బఫే డిన్నర్.  బంతి భోజనాలప్లేస్ లో ఈ డిన్నర్ అడుగు పెట్టగా..అరటిఆకులో భోజనం స్థానంలో ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్గ్ గ్లాసులు వచ్చిచేరాయి. అయితే మన ఆచార సంప్రదాయాలకు ఎన్నో అర్థాలు, పరమార్థాలు దాగి ఉన్నాయి. అసలు అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం. మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి గల కారణాలను ఈరోజు తెలుసుకుందాం…

అమ్మా ఆకలి అన్నవాడు శత్రువయినా సరే అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టే సమయంలో అవతలివారికి ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది.  అదే అరటి ఆకులో భోజనం పెడితే…  ఒక వేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి  అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు,  మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు.

అరటి ఆకు మీద వేడి వేడి పదార్ధాలను వడ్డిస్తే.. ఆ ఆకు మీద ఉండే పొర .. ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీంతో భోజనానికి అద్భుతమైన రుచి వస్తుంది. తిన్నది సులభంగా జీర్ణ మయ్యే శక్తిని కూడా పెంచుతుంది. ఈ ఆకులో అన్ని రకాలైన విటమిన్లు ఉండటంతో మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి శరీరానికి మంచి పోషకాలను అందచేస్తాయి.  అంతేకాదు ఎన్నో రకలైన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం. అరటి ఆకులో భోజనం కాన్సరు (మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్ మరియు బ్లాడర్), హెచ్.ఐ.వి , సిక్కా, పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

ఇక తిన్న తర్వాత ఆకులను బయట పడేసినా ఈజీగా మట్టిలో కలిసిపోతాయి. పర్యావరణానికి మేలు చేస్తాయి. నేలను సారవంతముగా మారుస్తాయి. ఇక అరటి ఆకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న గౌరవానికి ప్రతీక అని పూర్వీకుల భావన.

ఇన్ని రకాలైన ప్రయోజనాలు ఉండడంతో  అరటి ఆకు భోజనం  ఘనమైన భోజనాన్ని ప్రతిబింబిస్తుంది అంటారు.  అందరూ మంచిగా ఉండాలి.. మన అనుకున్న వాళ్ళకి జరగాలి అని అనుకోవడం సహజం కనుక అయినవాళ్ళకి ఆకుల్లో….. అనే సామెత వాడుకలోకి వచ్చింది అంటారు.  పూర్వ కాలంలో కేవలం అరటి ఆకుల్లో రోజూ భోజనం చేయడం వల్లనే అప్పటి వారు అంత ధృడంగా ఉండి ఉండేవారేమో!

ఒకొక్కసారి అరటి ఆకు అందుబాటులో లేకపోతే ప్రకృతిలో లభించే వివిధ ఆకులను భోజనం చేయడానికి ఉపయోగిస్తారు. విస్తరాకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిసివచ్చి సాక్షాత్తు లక్ష్మి దేవి ఇంట్లో ఉంటుంది. టేకు ఆకులోభోజనం చేయడం వలన భవిష్యత్త్, వర్తమానాలు తెలుసుకునే జ్ఞానం వస్తుంది.  జమ్మి విస్తర్లో భోజనం చేయడం వలన లోకాన్ని జయించే శక్తిని సంపాదించవచ్చు అని మన పురాణాలలో చెప్పబడింది. అయితే బాదం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారని పెద్దలు చెబుతారు. ఇది నిజమో లేక కల్పనో తెలియదు కాని మన అరటి ఆకులో మించిన భోజనం చేస్తే రుచి ప్లాస్టిక్ ప్లేట్స్ లో తింటే రాదు అని మాత్రం చెప్పవచ్చు. అందుకే అరటి ఆకును మించిన ఆకు లేదు.

Also Read:

కొత్తగా పెళ్లైందా.. ఈజీగా ఆన్ లైన్ లోనే ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ మార్చుకోవడం ఎలాగంటే?…

ఎస్‌బీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఆన్‌లైన్ లోనే నామినీ పేరు నమోదు చేసుకునే అవకాశం