Samsung: అద్భుతమైన ఫీచర్లతో శామ్‌సంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఎప్పటినుంచి అందుబాటులోకి రానుందంటే..?

Samsung 5g Mobile: శామ్‌సంగ్ అద్భుతమైన ఫీచర్లతో మరో ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. గెలాక్సీ ఎ 32 5 జి స్మార్ట్‌ఫోన్‌ రేపటినుంచి..

Samsung: అద్భుతమైన ఫీచర్లతో శామ్‌సంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఎప్పటినుంచి అందుబాటులోకి రానుందంటే..?
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 12, 2021 | 2:55 PM

Samsung 5g Mobile: శామ్‌సంగ్ అద్భుతమైన ఫీచర్లతో మరో ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. గెలాక్సీ ఎ 32 5 జి స్మార్ట్‌ఫోన్‌ రేపటినుంచి మార్కెట్‌లోకి రానుంది. ఇది అత్యంత సరసమైన ధరకు లభించే 5జీ స్మార్ట్‌ఫోన్ అని సంస్థ సిబ్బంది వెల్లడిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఇది మార్కెట్‌లోకి రావడంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48 మెగాపిక్సల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 6.5 స్క్రీన్‌తో ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌లో లభించనుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 32 5 జి ప్రస్తుతం స్పెయిన్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అక్కడి ధర ప్రకారం 64 జీబీ వేరియంట్ ధర సుమారు 24,600 ఉంటుందని అంచనా. ఇంకా 128జీబీ వేరియంట్ ధర కూడా తెలియాల్సి ఉంది. ఇది బ్లాక్, వైట్, బ్లూ, వైలెట్ రంగుల్లో లభించనుంది. భారత మార్కెట్లో అతితక్కువ ధరకు లభించే 5జీ ఫోన్ కావడంతో అంతటా ఆసక్తి నెలకొంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. దిగి వచ్చిన బంగారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా

Walking: నడవడం వల్ల ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయి..? వాకింగ్‌ ఎలా చేయాలి.. ఎలాంటి ఉపయోగాలు..!