Jawa Moto 2021: మార్కెట్‌లోకి సరికొత్త హై-స్పీడ్ స్పోర్ట్స్ బైక్.. యూత్‌ను బాగా ఆకర్షించే ఫీచర్లు..
Jawa Moto 2021: క్లాసిక్ లెజెండ్స్ కంపెనీ కొత్త జావా 42 రేంజ్ బైక్‌ను ఢిల్లీలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ బైక్ ధరను...
Jawa Moto 2021: క్లాసిక్ లెజెండ్స్ కంపెనీ కొత్త జావా 42 రేంజ్ బైక్‌ను ఢిల్లీలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ బైక్ ధరను రూ. 1.83 లక్షలుగా నిర్ణయించింది. కొత్తరకం అప్‌గ్రేడెడ్ ఇంజిన్‌తో.. న్యూ మేక్ ఓవర్‌తో ఈ బైక్ చూపరులను ఆకర్షిస్తుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా హన్నెస్ సిబి 350, బెనెల్లి ఇంపీరియల్ 400 బైకులు మార్కెట్‌లో అత్యంత ఆదరణ పొందుతుండగా.. ఇప్పుడు వాటితో లాభదాయకమైన క్రూయిజర్ విభాగంలో జావా 42 బైక్ పోటీ పడనుంది.
జావా 42 బైక్‌లోని ప్రత్యేకతలు…
ఓరియన్ రెడ్, సిరియస్ వైట్, ఆల్‌స్టార్ బ్లాక్ రంగుల్లో వినియోగదారులకు ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది. బూడిద రంగులోని క్లాసిక్ స్పోర్ట్స్ స్ట్రిప్ మోటారు సైకిల్‌కు అదనపు ఆకర్షణను తీసుకొస్తుంది. క్లాసిక్ స్పోర్ట్స్ వెర్షన్‌కు తగ్గట్టుగా ఈ బైక్‌కు రెండు వైపులా బార్-ఎండ్ మిరర్స్ అమర్చబడి ఉన్నాయి. సింగిల్ పాడ్ ఆఫ్‌సెట్ మౌంటెడ్ యూనిట్‌గా స్పీడో కన్సోల్ కొనసాగుతూ.. అది ట్రిప్ మీటర్‌తో అమర్చబడి ఉంది. అలాగే మరింత సౌలభ్యం కలిగే విధంగా సీట్ పాన్‌ను కూడా సంస్థ రూపకల్పన చేసింది.
జావా 42: ఇంజిన్ అప్‌గ్రేడ్
జావా 42 మోటార్ బైక్‌కు సంస్థ అధునాతన ఇంజిన్‌తో అప్‌గ్రేడ్ చేసింది. క్రాస్ పోర్ట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే మొట్టమొదటి సింగిల్ సిలిండర్ ఇంజిన్ 293 సిసి లిక్విడ్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజిన్‌ను ఇందులో అమర్చారు. దీనితో వాల్యూమెట్రిక్ సామర్ధ్యం పెరుగుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి:
12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!
తనకున్న వ్యాధిపై క్లారిటీ ఇచ్చి ఎమోషనల్ అయిన కాజల్.. షాక్‌లో ఫ్యాన్స్.!