జన్‏ధన్ ఖాతాదారులకు శుభవార్త.. వారి కోసం సూపర్ ఆఫర్ ప్రకటించిన ఎస్బీఐ.. ఎంటో తెలుసా ?

స్బీఐ బ్యాంకులో జన్‏ధన్ అకౌంట్ ఉన్నవారికి సూపర్ ఆఫర్ ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేంటంటే.. ఎస్బీఐ రూపే జన్‏ధన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని

జన్‏ధన్ ఖాతాదారులకు శుభవార్త.. వారి కోసం సూపర్ ఆఫర్ ప్రకటించిన ఎస్బీఐ.. ఎంటో తెలుసా ?
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 12, 2021 | 1:07 PM

State Bank Of India: ఎస్బీఐ బ్యాంకులో జన్‏ధన్ అకౌంట్ ఉన్నవారికి సూపర్ ఆఫర్ ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేంటంటే.. ఎస్బీఐ రూపే జన్‏ధన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఖాతాదారులకు తెలిపింది. ఈ కార్డుతో పాటు 2 లక్షల వరకు ప్రమాద భీమా ప్రయోజనాలు ఉచితంగా అందుతాయని తెలిపింది. ఈ ఆఫర్ ఖాతాదారులకు వర్తించాలంటే ప్రతి 90 రోజులకు ఒకసారి రూప్ జన్‏ధన్ కార్డును స్వైప్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వారిందరికీ రూ.2 లక్షల ప్రమాద భీమా వర్తిస్తుంది. ప్రధాన మంత్రి జన్‏ధన్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా పేద ప్రజలందరికీ ఉచితంగా బ్యాంక్ అకౌంట్లను అందిస్తుంది. ఇందులో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, నగదు లావాదేవీలు జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ అకౌంట్ ఓపెన్ చేసిన నిరుపేదల ఖాతాల్లోకి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదును నేరుగా వేస్తారు. ఇందుకోసం ఉచిత మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం కూడా ఉంటుంది. అన్ని ఖాతాల మాదిరే పొదుపుపై వడ్డీ కూడా అందుతుంది. జన్‏ధన్ ఖాతాదారులకు రూ.30 వేల జీవిత భీమాతోపాటు రూ.2 లక్షల ప్రమాద భీమా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ జన్‏ధన్ ఖాతాదారులకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో మనీ ట్రాన్స్ ఫర్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 41.75 కోట్ల బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసింది. ఇక ఇందులో 35.96 కోట్ల ఖాతాలు ఆపరేటివ్‍గా ఉంటాయి.

Also Read: SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ రుణాలపై బంపర్ ఆఫర్స్… వారికి మాత్రమే ఛాన్స్..