Master Card : మాస్టర్ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్.. క్రిప్టో కరెన్సీ లావాదేవీల విషయంలో సరికొత్త ప్రకటన..
Master Card : ఆర్థిక సేవల సంస్థ మాస్టర్‌కార్డ్ తన సేవలను విస్తరిస్తోంది. క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు సంబంధించి తాజాగా
Master Card : ఆర్థిక సేవల సంస్థ మాస్టర్‌కార్డ్ తన సేవలను విస్తరిస్తోంది. క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు సంబంధించి తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఎంచుకున్న క్రిప్టో కరెన్సీలకు మాస్టర్‌కార్డ్ నెట్‌వర్క్‌లో ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. రానున్న రోజుల్లో క్రిప్టో కరెన్సీ, దాని చెల్లింపులకు సంబంధించి పూర్తి ప్రక్రియకు సిద్ధమవుతున్నామని ప్రకటించింది. కొత్త డిజిటల్ కరెన్సీలను ప్రారంభించాలనే ప్రణాళికలో భాగంగా మాస్టర్‌కార్డ్ అంతర్జాతీయంగా ఉన్న కేంద్ర బ్యాంకులను పరిశీలిస్తున్నట్టు సంస్థ తెలిపింది.
ఇందులో భాగంగానే సంస్థ వినియోగదారుల భద్రత, అనుమతికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అంతేకాకుండా ఇప్పటికే బిట్‌పే, వైరెక్స్ లాంటి భారీ క్రిప్టో కరెన్సీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్టు పేర్కొంది. ఈ మార్పుతో నేరుగా డిజిటల్ ఆస్తులకు మద్దతివ్వడం ద్వారా వ్యాపారులు క్రిప్టో కరెన్సీని అంగీకరించేందుకు వీలవుతుంది. ఇది ప్రస్తుతం ప్రతి డిజిటల్ ఆస్తికి ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులకు పరిమితం చేసినట్టు డిజిటల్ అసెట్, బ్లాక్‌చైన్ ఉత్పత్తుల ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజ్ దామోదరణ్ చెప్పారు.
Student suicide: “అమ్మ లేకుండా నేనెలా బ్రతకగలను”..! క్లాస్ రూమ్‌లో విద్యార్థి ఆత్మహత్య..