Student suicide: “అమ్మ లేకుండా నేనెలా బ్రతకగలను”..! క్లాస్ రూమ్‌లో విద్యార్థి ఆత్మహత్య..

మహబూబ్‌నగర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ ఇంటర్ విద్యార్థి కళాశాలలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

Student suicide: అమ్మ లేకుండా నేనెలా బ్రతకగలను..! క్లాస్ రూమ్‌లో విద్యార్థి ఆత్మహత్య..
Hanging Tik Tok
Ram Naramaneni

|

Feb 12, 2021 | 3:33 PM

Student suicide: మహబూబ్‌నగర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ ఇంటర్ విద్యార్థి కళాశాలలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా ధన్వాడకు చెందిన బాలరాజు.. మహబూబ్‌నగర్‌‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం‌ చదివేవాడు. అదే కళాశాలకు చెందిన హాస్టల్ ఉండేవాడు.

తాజాగా కళాశాల థర్డ్ ఫ్లోర్‌లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన సహచర విద్యార్థులు కాలేజీ మేనేజ్‌మెంట్‌కు సమాచారం అందించారు. యాజమాన్యం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.

15 రోజుల క్రితం బాలరాజు తల్లి అనారోగ్యంతో ప్రాణాలు విడిచారు. తన తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక బాలరాజు ముభావంగా ఉన్నాడని స్నేహితులు చెబుతున్నారు.  అమ్మ చనిపోయిందనే బాధలోనే విద్యార్థి తనువు చాలించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Also Read:

బోరబొండలో ఓ ఇళ్లు.. ఆ ఇంట్లో ఓ ట్రంకు పెట్టె.. అందులో అస్థిపంజరం.. అసలు మిస్టరీ విడిపోయింది..

డబ్బుల వర్షం కురుస్తుందని క్షుద్రపూజలు.. నమ్మారో అంతే సంగతులు.. భారీ మోసం వెలుగులోకి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu