Walking: నడవడం వల్ల ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయి..? వాకింగ్‌ ఎలా చేయాలి.. ఎలాంటి ఉపయోగాలు..!

Walking: నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజు వాకింగ్‌ చేస్తే ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చని వైద్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్న మాట. అయితే వేగంగా నడవడం ...

Walking: నడవడం వల్ల ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయి..? వాకింగ్‌ ఎలా చేయాలి.. ఎలాంటి ఉపయోగాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 12, 2021 | 11:30 AM

Walking: నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజు వాకింగ్‌ చేస్తే ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చని వైద్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్న మాట. అయితే వేగంగా నడవడం వల్ల మన శరీరంలో కేలరీలు అధికంగా ఖర్చు అవుతాయనే విషయం మనకు తెలిసిందే. అయితే ఎంత వేగంగా నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చవుతాయి…అనేది మనకు తెలియదు. తెలిస్తే మరికొన్ని కేలరీలు ఖర్చయ్యేలా నడుస్తాము. నడవడం వల్ల ఎన్ని కేలరీలు ఖర్చుఅవుతాయో వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

నిదానంగా నడవడం వల్ల..

మనం నిదానంగా నడవడం వల్ల 15 నిమిషాల్లో 9 క ఏలరీలు ఖర్చు అవుతాయి. 30 నిముషాల్లో 25 కేలరీలకు ఖర్చుచేయవచ్చు. ఇక నిదానంగా కాకుండా కాస్త సాధారణం కంటే కొంత వేగంతో నడిస్తే 15 నిముషాల్లో 25 కేలరీలు ఖర్చు అవుతుంది. అలాగే అరగంటలో 50 పైగా కేలరీలు ఖర్చవుతాయి. బ్రిస్క్‌ వాకింగ్‌ గానీ రన్నింగ్‌ కానీ చేస్తే మనం అనుకున్నంత ఫలితాన్ని పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అరగంటలో 250 కేలరీలను ఖర్చుచేయవచ్చు. నడిచే దూరాన్ని బట్టి కూడా కేలరీలు ఖర్చవటం అనేది జరుగుతుంది. కొంతమంది ఒక మైలుతో మొదలుపెట్టి రెండు నుండి నాలుగు మైళ్లవరకు వాకింగ్‌ చేస్తుంటారు.

ఎలా నడవాలో సూచిస్తున్న వైద్యులు..

వాకింగ్‌ మొదలు ప్రారంభించగానే గంటలు గంటలు నడవకుండా శరీరం అలవాటు పడేలా సమయాన్ని పెంచుతూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకేసారి అరగంట కాకుండా ముందు పావుగంట పాటు నడవాలి. తర్వాత అరగంట, ఆపైన అరగంట నుంచి ముప్పావు గంటవరకు, తర్వాత గంటవరకు పెంచుతూ పోవాలి. మొదట అరగంటలో ఒక మైలు నడిస్తే చాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత ఒక మైలు దూరాన్ని పావుగంటలో నడిచేంత వేగం వరకు ప్రయత్నించవచ్చు. వేగం పెంచుతున్న కొద్దీ మన శరీరంలో శక్తి స్థాయి, మెటబాలిజం పెరుగుతుంటుంది. వారం పాటు ప్రతిరోజూ నడవటం వల్ల అత్యధికంగా 1500 కేలరీల వరకు ఖర్చవుతాయి. వాకింగ్‌ అప్పుడే మొదలుపెట్టినవారికి ఇది మంచి ఫలితం. అయితే ఒకసారి వాకింగ్‌ మొదలుపెట్టాక దాన్ని ఆపకుండా చేస్తూనే ఉండాలి. అప్పుడే సరైన ఫలితం కనబడుతుందని చెబుతున్నారు.

ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు..

ఎక్కువ మంది బరువు త్వరగా తగ్గాలనే ఉద్దేశంతో వాకింగ్‌ చేస్తుంటారు. అలాంటి వారు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చాలా కఠిన మైన నియమాలు పెట్టుకుని వాకింగ్‌ చేస్తున్నా.. తిండి ఆపకపోతే వారు అనుకున్న ఫలితాన్ని సాధించలేరు. మరీ ముఖ్యంగా కొంతమంది అవసరం లేకపోయినా అదే పనిగా తింటూ ఉంటారు. వీరు తినే ఆహారం కూడా ఎక్కు వగా జంక్‌ ఫుడే అయి ఉంటుంది. ఇలాంటివారు ఎంతగా వాకింగ్‌ చేసినా.. ఖర్చువుతున్న కేలరీలకు సరిపడా తిరిగి తినేస్తుంటారు. అందుకే బరువు తగ్గటం అంటూ ఉండదు. ఆహారాన్ని అదుపులో పెట్టుకోకపోతే శ్రమంతా వృథా అయిపోతుంది. వాకింగ్‌ చేసినా.. బరువు తగ్గాలనుకున్నా.. ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి.

రోజుకు అరగంట పాటు నడిస్తే..

బరువు తగ్గాలనుకునే వారు రోజుకు అరగంట పాటు నడవాలి. అలా నడుస్తున్నకొద్ది రెండు నెలల్లో బరువు అనేది తగ్గడం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే తప్పనిసరిగా ఆ నడక వేగంగా ఉండాలి. కొంతమంది ఒక వారం రెండువారాలు నడిచి ఇంకా బరువు తగ్గటం లేదని నిరాశపడి వాకింగ్‌ చేయడం మానేస్తుంటారు. అలా చేయకూడదు. శరీరంలో పేరుకున్న కొవ్వు కరగాలంటే కొంత సమయం పడుతుంది. ఒపికతో క్రమం తప్పకుండా వాకింగ్‌ చేస్తుండాలి.

వాకింగ్‌ చేసే వా

మలుపుల్లో నడిస్తే మంచిది..

రు మలుపుల్లో నడిస్తే ఇంకా మంచిదంటున్నారు. నడిచేటప్పుడు నేరుగా ఉన్న రోడ్డుమీద కాకుండా మలుపులు ఉన్న బాటలో నడిస్తే మరింత ఎక్కువగా కేలరీలు ఖర్చవుతాయట. అలాగే ముందుకు కాకుండా వెనక్కు నడిస్తే మరింత మంచి ఫలితాన్ని పొందవచ్చట. వెనక్కు నడిస్తే మన గుండె వేగం మరింత ఎక్కువగా ఉంటుందట. దాంతో సాధారణ నడకతో కంటే ఈ రివర్స్‌ నడకతో గుండెకు మరింత మేలు జరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఎక్కువ కేలరీలు సైతం ఖర్చవుతాయి. వెనుక నుండి వాహనాలు రావనే నమ్మకం ఉన్న ప్రదేశాల్లో కొంత సమయం ఇలా నడవవచ్చు.

డయాబెటిస్‌ ఉన్నవారికి..

ప్రతి రోజు వాకింగ్‌ చేయడం వల్ల డయాబెటిస్‌ ఉన్న వారికి మరి మంచిది. ప్రతి రోజు క్రమం తప్పకుండా వాకింగ్‌ చేస్తే షుగర్‌ వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే గుండె జబ్బులున్నవారికి ఎంతో మేలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాకింగ్‌ అనేది ఒక్క బరువు తగ్గడానికే కాకుండా ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. శరీరం హుషారుగా ఉండేటట్లు చేస్తుంది. క్రమం తప్పకుండా వాకింగ్‌ చేసిన వారు చురుకుగా ఉంటారు.

Also Read:

Guava Health Benefits: జామతో బోలెడు ప్రయోజనాలు.. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి లాభాలంటే..

రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ టీ ఎంతో మేలంట.. సలహాలిస్తున్న బాలీవుడ్ హీరోయిన్.

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!