Sister Andre: కరోనాను ఓడించిన 116 ఏళ్ల బామ్మ.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వృద్ధురాలు..

Sister Andre: కరోనా మహమ్మారిని తట్టుకోలేక ఎంతోమంది మృత్యు ఒడిలోకి చేరిపోతున్నారు. కొంతమంది మాత్రం ధైర్యంగా

Sister Andre: కరోనాను ఓడించిన 116 ఏళ్ల బామ్మ.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వృద్ధురాలు..
Follow us
uppula Raju

|

Updated on: Feb 11, 2021 | 4:39 PM

Sister Andre: కరోనా మహమ్మారిని తట్టుకోలేక ఎంతోమంది మృత్యు ఒడిలోకి చేరిపోతున్నారు. కొంతమంది మాత్రం ధైర్యంగా ఎదుర్కొని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఈ కోవాలోకే వస్తోంది 116 ఏళ్ల ఫ్రెంచ్ సన్యాసిని, ఈ వయసులో కూడా ఆమె కరోనాను జయించి తన 117 వ పుట్టినరోజుకు సిద్ధమవుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వివరాల్లోకి వెళితే..116 ఏళ్ల ఫ్రెంచ్ సన్యాసిని తన 117 వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు, కరోనావైరస్ నుండి బయటపడిన పెద్ద వ్యక్తిగా రికార్డుల కెక్కింది. 1944 లో సిస్టర్ ఆండ్రీ గాపేరు మార్చుకున్న లూసిల్ రాండన్, జనవరి 16 న దక్షిణ ఫ్రాన్స్‌లోని తన గృహంలో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో ఆమె ఇతర నివాసితుల నుండి వేరుచేయబడింది, కానీ లక్షణాలు కనిపించలేదు.

అంధురాలు మరియు వీల్ చైర్ వాడుతున్న సిస్టర్ ఆండ్రీ, తనకు కరోనా నిర్ధారణ అయినప్పటికీ ఆందోళన చెందలేదు. సిస్టర్ ఆండ్రీ ఫ్రాన్స్ యొక్క బిఎఫ్ఎం టెలివిజన్‌తో మాట్లాడుతూ, “నేను చనిపోవడానికి భయపడలేదు. మీతో ఉండటం నాకు సంతోషంగా ఉంది, కానీ నేను మరెక్కడైనా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది. ఫిబ్రవరి 11, 1904న జన్మించిన సిస్టర్ ఆండ్రీ, జెరోంటాలజీ రీసెర్చ్ గ్రూప్ (జిఆర్జి) ప్రపంచ సూపర్ సెంటెనరియన్ ర్యాంకింగ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలో రెండో అతి పెద్ద వ్యక్తి. జనవరి 2న 118 ఏళ్లు నిండిన జపాన్‌కు చెందిన కేన్ తనకాలో అత్యంత పురాతన వ్యక్తి. జిఆర్‌జి జాబితాలో ప్రపంచంలోని పురాతన వ్యక్తులలో ఇరవై మంది మహిళలు వున్నారు. సిస్టర్ ఆండ్రీకి ముందు, స్పెయిన్లో 113 ఏళ్ల మహిళ కరోనావైరస్ ను మే 2020 లో ఓడించింది. మార్చి 4, 1907న యుఎస్ లో జన్మించిన మరియా బ్రాన్యాస్ కు ఏప్రిల్ లోకోవిడ్-19 సోకింది, కానీ ఆమె ఈ వ్యాధితో ఒంటరిగా పోరాడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రాన్యాస్ తన కుటుంబంతో కలిసి స్పెయిన్ కు వెళ్లారు మరియు 1918-19లో ప్రపంచాన్ని కదిలించిన స్పానిష్ ఫ్లూ ఆమెకు సోకిన తరువాత కూడా జీవించారు.