Dog at uttarakhand dam: 3 రోజులుగా కార్మికులు కోసం టన్నెల్ ముందే శునకం.. ఉత్తరాఖండ్‌లో కన్నీరు పెట్టించే దృశ్యం

ఉత్తరాఖండ్​ చమోలీ జిల్లాలోని అలకనందా నది మరోమారు ఉప్పొంగింది. ఈ హఠాత్ పరిణామంతో అధికారులు ఒక్కసారిగా టెన్షన్‌కు గురయ్యారు.  ముందు జాగ్రత్త చర్యగా తపోవన్ టన్నెల్ వద్ద సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిపివేశారు.

Dog at uttarakhand dam: 3 రోజులుగా కార్మికులు కోసం టన్నెల్ ముందే శునకం.. ఉత్తరాఖండ్‌లో కన్నీరు పెట్టించే దృశ్యం
Follow us

|

Updated on: Feb 11, 2021 | 4:58 PM

Dog at uttarakhand dam:  ఉత్తరాఖండ్​ చమోలీ జిల్లాలోని అలకనందా నది మరోమారు ఉప్పొంగింది. ఈ హఠాత్ పరిణామంతో అధికారులు ఒక్కసారిగా టెన్షన్‌కు గురయ్యారు.  ముందు జాగ్రత్త చర్యగా తపోవన్ టన్నెల్ వద్ద సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల వరదల సమయంలో టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు సేఫ్‌గా బయటకు వస్తారని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారితో పాటు అక్కడ ఓ శునకం తెగ తచ్చాడుతుంది. అది ఊరికే అక్కడ తిరుగుతుందని అధికారులు తొలుతు అనుకున్నారు. అక్కడ నుంచి తరిమేయడానికి ట్రై చేశారు. ఎన్నిసార్లు తరిమినా అది తిరిగి అక్కడికే వచ్చి కూర్చుంటుంది. ఏంటా అని ఆరా తీయగా.. విషయం తెలిసి అక్కడ ఉన్నవాళ్లు మనసులు తల్లడిల్లాయి.

టన్నెల్‌లో చిక్కుకున్న తన కార్మికుల గురించే ఆ శునకం అక్కడ ఆశగా ఎదురుచూస్తోంది. అక్కడి కార్మికులతో ఆ శునకానికి ఎంతో అనుబంధం ఉందట.  ప్రమాదం నుంచి బయటపడ్డ కార్మిడొకరు ఈ వివరాలు తెలియజేశాడు. రెండేళ్ల వయసున్న భూతియా బ్రీడ్‌కు చెందిన ఆ కుక్క పేరు ‘బ్లాకీ’. టన్నెల్‌‌లో పనిచేస్తున్న కొంత మంది వర్కర్లు.. రోజూ తాము తెచ్చుకున్న ఆహారంలో కొంత దానికి పెట్టేవారు. దాంతో అది వారి వెంటే తిరిగేది. సొరంగంలో కార్మికులు పనిచేసుకుంటుంటే.. బ్లాకీ వారితో వెళ్లి వారితోనే ఉండేది. అక్కడే నిద్రించేది. సాయంత్రం కార్మికులు వెళ్లిపోగానే అది అక్కడ నుంచి వెళ్లిపోయేది.

‘ఆ రోజు బ్లాకీ ఎక్కడికో వెళ్లొచ్చేసరికి వదర బీభత్సం సంభవించింది. అక్కడికి తిరిగొచ్చే సరికి చాలామంది కొత్త జనాలు, హడావిడి కనినపించింది. తన వాళ్లు ఏదో అపాయంలో ఉన్నారని దానికి అర్థమైంది. అందుకే 3 రోజులు వారి కోసం అక్కడే ఎదురు చూస్తుంది’ అని అజిత్ కుమార్ అనే స్థానికుడు తెలిపాడు. అదండి శునకం విశ్వాసం.

Also Read:

2021 Royal Enfield Himalayan: రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ వచ్చేసింది చిచ్చా.. ధర, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి