2021 Royal Enfield Himalayan: రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ వచ్చేసింది చిచ్చా.. ధర, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి
రాయల్ ఎన్‌ఫీల్డ్ గురువారం 2021 హిమాలయన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. యూకోతో పాటు ఇతర యూరోపియన్ మార్కెట్లలో కూడా దీన్ని ఒకేసారి లాంచ్ చేశారు. 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ధర...
Royal Enfield Himalayan: రాయల్ ఎన్‌ఫీల్డ్ గురువారం 2021 హిమాలయన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. యూకోతో పాటు ఇతర యూరోపియన్ మార్కెట్లలో కూడా దీన్ని ఒకేసారి లాంచ్ చేశారు. 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ధర రూ .2,01,314 (ఎక్స్-షోరూమ్, చెన్నై) గా ఉంది. మోటారుసైకిల్‌ను ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. టెస్ట్ రైడ్‌లకు కూడా అందుబాటులో ఉంటుంది. 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటారుసైకిల్‌ను ‘మేక్-ఇట్-యువర్స్’ ప్లాట్‌ఫామ్‌లో కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడ వినియోగదారులు మోటారుసైకిల్‌ను తమ కావాల్సిన మోడల్ కోరవచ్చు. కావాల్సిన విధంగా డిజైన్ చేయించుకోవచ్చు. బుకింగ్ కూడా చేసుకోవచ్చు.
2021 హిమాలయన్ కొన్ని లుకింగ్ వైజ్, ఫీచర్స్ పరంగా కొన్ని మార్పులు ఉన్నాయి. పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పు లేదు. 2021 RE హిమాలయన్ వెహికల్‌లో గుర్తించదగిన మార్పు ఏంటంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్రిప్పర్. ఇది బైక్ నడిపే వ్యక్తికి టర్న్-బై-టర్న్ వివరించే నావిగేషన్ పాడ్ అనమాట.
హిమాలయన్ 411 సిసి, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. మోటారుసైకిల్ గరిష్టంగా 24.83 పిఎస్, 32 ఎన్ఎమ్ పీక్ టార్క్ శక్తిని అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌కు జత చేయబడింది. ఇంకెందుకు ఆలస్యం ఎన్‌ఫీల్డ్ ప్రియులు కొత్త మోడల్‌పై ఓ టెస్ట్ రైడ్‌కు వెళ్లి వచ్చేయండి.
Mega Hero Kalyan Dev: ఆశ్యర్యం.. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త చిత్రానికి దర్శకత్వం వహించిందోచ్..