AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega Hero Kalyan Dev: ఆశ్యర్యం.. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త చిత్రానికి దర్శకత్వం వహించిందోచ్..

గురువారం మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ పుట్టినరోజు. ఈ క్రమంలో అతడి తదుపరి సినిమాలకు సంబంధించిన బ్యాక్ టూ బ్యాక్ అప్‌డేట్స్ వస్తున్నాయి. అయితే అతడి కొత్త చిత్రం

Mega Hero Kalyan Dev: ఆశ్యర్యం.. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త చిత్రానికి దర్శకత్వం వహించిందోచ్..
Ram Naramaneni
|

Updated on: Feb 11, 2021 | 4:19 PM

Share

Mega Hero Kalyan Dev:  గురువారం మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ పుట్టినరోజు. ఈ క్రమంలో అతడి తదుపరి సినిమాలకు సంబంధించిన బ్యాక్ టూ బ్యాక్ అప్‌డేట్స్ వస్తున్నాయి. అయితే అతడి కొత్త చిత్రం నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది. అందుకు పెద్ద కారణమే ఉందండోయ్.   కల్యాణ్ దేవ్ ప్రధాన పాత్రలో శ్రీధార్ సిపాన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ  సినిమా నుంచి దేవ్ బర్త్​డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్​ను విడుదల చేసింది మూవీ యూనిట్. చిరంజీవి కుమార్తె, కల్యాణ్ దేవ్ భార్య శ్రీజ ఓ షాట్​కు యాక్షన్ చెబుతూ కనిపించింది. ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్​గా నటిస్తుండగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతోన్న మరో చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రచితా రామ్ హీరోయిన్​గా నటిస్తుంది. ఈరోజు కల్యాణ్ బర్త్​డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘మీనమ్మ’ అనే పాటను విడుదల చేసింది మూవీ యూనిట్. తమన్ మ్యూజిక్ అందించిన ఈ పాటను వేణు శ్రీరంగం, గీతామాధురి పాడారు.

Also Read:

‘ఉప్పెన’లోని భావోద్వేగాలు అందరికి నచ్చుతాయి.. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారంటున్న పవర్‌‌స్టార్..

సంగీత దర్శకుడిగా మరెవ్వరూ చేయలేని ప్రయోగాలు, వైవిధ్యభరితమైన పాటలను స్వరపరచిన ఘంటసాల