‘ఉప్పెన’లోని భావోద్వేగాలు అందరికి నచ్చుతాయి.. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారంటున్న పవర్‌‌స్టార్..

పవన్ కల్యాణ్ మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఉప్పెన’ చిత్రానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

'ఉప్పెన'లోని భావోద్వేగాలు అందరికి నచ్చుతాయి.. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారంటున్న పవర్‌‌స్టార్..
Follow us
uppula Raju

|

Updated on: Feb 11, 2021 | 3:02 PM

పవన్ కల్యాణ్ మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఉప్పెన’ చిత్రానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా పవన్‌కల్యాణ్‌ను ‘ఉప్పెన’ చిత్రబృందం కలిసింది. సినిమా ట్రైలర్‌ వీక్షించిన అనంతరం పవన్‌కల్యాణ్‌.. వైష్ణవ్‌ తేజ్‌, బుచ్చిబాబుతో పాటు ఇతర చిత్రబృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

మన జీవితాల్ని, అందులోని భావోద్వేగాల్ని, మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. ‘జానీ’లో బాలనటుడిగా హీరో చిన్నప్పటి పాత్ర పోషించిన వైష్ణవ్ ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాడన్నారు. బుచ్చిబాబు ఎంతో సమర్థవంతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని కొనియాడారు. ‘రంగస్థలం’, ‘దంగల్‌’ చిత్రాలు భావోద్వేగాల నేపథ్యంలో వచ్చిన సినిమాలే అందుకే అవి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రను వేశాయి. అదే కోవాలో ఉప్పెన సినిమా కూడా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని తెలిపారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. హీరోగా తొలి చిత్రంలోనే వైష్ణవ్‌ మంచి కథ ఎంచుకున్నాడని, మొదటి అడుగులోనే సవాల్‌తో కూడుకున్న పాత్ర తీసుకున్నాడని తప్పకుండా విజయం సాధిస్తాడని చెప్పారు.

Pawan kalyan-Harish Shankar Movie : ఈ సారి పవన్ కళ్యాణ్ ను హరీష్ శంకర్ అలా చూపించబోతున్నాడట..!