AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ‘రాములా ఆగం’ ఇంకా కొనసాగుతూనే ఉందిగా… యూట్యూబ్‌ సెన్సేషన్‌గా ‘స్టైలిష్ స్టార్‌’ పాట..

Ramula Song Become Sensation In Youtube: సినిమాలు ప్రేక్షకులకు కొంత సమయం వరకే గుర్తుంటాయి. కానీ అందులోని పాటలు పాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటూనే ఉంటాయి...

Allu Arjun: 'రాములా ఆగం' ఇంకా కొనసాగుతూనే ఉందిగా... యూట్యూబ్‌ సెన్సేషన్‌గా 'స్టైలిష్ స్టార్‌' పాట..
Narender Vaitla
|

Updated on: Feb 11, 2021 | 3:57 PM

Share

Ramula Song Become Sensation In Youtube: సినిమాలు ప్రేక్షకులకు కొంత సమయం వరకే గుర్తుంటాయి. కానీ అందులోని పాటలు పాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటూనే ఉంటాయి. ఇటీవలి కాలంలో అలాంటి పాటలతో వచ్చిన చిత్రమే ‘అల వైకుంఠ పురములో’. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ఇందులోని పాటలు కూడా అదే స్థాయిలో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలోని ఒక్కో పాట ఒక్కో సంచలనం. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది గడుస్తోన్నా ఈ సినిమాలోని పాటలు ఇంకా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా ‘అల వైకుంఠపురములో’ని.. ‘రాములో రాములా’ సాంగ్‌ మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ పాట ఫుల్‌ వీడియోను ఇప్పటి వరకు 300 మిలియన్లకుపైగా (30 కోట్లకుపైగా) వ్యూలు రావడం విశేషం. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ సెన్సేషన్‌గా కొనసాగుతోంది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫి అందించిన ఈ పాటకు అనురాగ్‌ కులకర్ణీ, మంగ్లీలు తమ గాత్రంతో మ్యాజిక్‌ చేశారు. ఫోక్‌ నేపథ్యంలో వచ్చే చరణాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరోసారి ఈ పాటను మీరూ వినేయండి మరి.

Also Read: అక్షర్‌ధామ్ టెంపుల్ అటాక్‌‌ నేపథ్యంగా ‘జీ5’ సిరీస్.. ఎన్‌ఎస్‌జీ కమాండోగా కనిపించనున్న అక్షయ్ ఖన్నా