అక్షర్‌ధామ్ టెంపుల్ అటాక్‌‌ నేపథ్యంగా ‘జీ5’ సిరీస్.. ఎన్‌ఎస్‌జీ కమాండోగా కనిపించనున్న అక్షయ్ ఖన్నా

బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కెన్ ఘోష్ డైరెక్షన్‌లో వస్తున్న సిరీస్‌కు ‘స్టేట్ ఆఫ్ సీజ్ : అక్షర్‌ధామ్’

అక్షర్‌ధామ్ టెంపుల్ అటాక్‌‌ నేపథ్యంగా ‘జీ5’ సిరీస్.. ఎన్‌ఎస్‌జీ కమాండోగా కనిపించనున్న అక్షయ్ ఖన్నా
Follow us
uppula Raju

|

Updated on: Feb 11, 2021 | 3:25 PM

బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కెన్ ఘోష్ డైరెక్షన్‌లో వస్తున్న సిరీస్‌కు ‘స్టేట్ ఆఫ్ సీజ్ : అక్షర్‌ధామ్’ టైటిల్ ఫైనల్ కాగా జీ5లో ప్రసారం కాబోతోంది. స్టేట్ ఆఫ్ సీజ్ ఫ్రాంచైజీలో ‘26/11 ముంబై అటాక్స్’ ఫస్ట్ పార్ట్‌గా రాగా, సెకండ్ పార్ట్ 2002లో జరిగిన అక్షర్‌ధామ్ టెంపుల్ అటాక్‌లో ఎన్ఎస్‌జీ కమాండోస్ చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ బేస్ చేసుకుని రాబోతోంది.

కాగా ఈ సిరీస్‌లో అక్షయ్ ఖన్నా ఎన్‌ఎస్‌జీ కమాండోగా ఎంటైర్ మిషన్‌కు నాయకత్వం వహించే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. నవంబర్, డిసెంబర్‌లో ఇప్పటికే ఇందుకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, త్వరలో ‘జీ5’లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అక్షయ్, కెన్ ఘోష్ ఫస్ట్ టైమ్ కొలాబరేట్ అయిన ఈ సిరీస్‌.. బాధితులు, ప్రాణాలర్పించిన కమాండోల గౌరవార్థం ఇండియన్ స్పిరిట్‌ను సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుందని తెలిపారు. కాగా 24 సెప్టెంబర్, 2002లో జరిగిన అక్షర్‌ధామ్ టెంపుల్ అటాక్‌‌లో ఇద్దరు గన్‌మెన్‌లు ఆలయ పరిసరాల్లోకి ప్రవేశించి దాడులు జరిపారు. ఈ ఘటనలో 30 మంది చనిపోగా 80 మంది గాయపడ్డారు. వీరిలో 27 మంది యాత్రికులతో పాటు ఇద్దరు స్టేట్ కమాండోస్(అర్జున్ సింగ్ గమేతి, అల్లా రఖా ఉనద్జం), ఒక ఎన్‌ఎస్‌జీ కమాండో(సుబేదార్ సురేశ్ చంద్ర యాదవ్) ఉన్నారు.

‘ఉప్పెన’లోని భావోద్వేగాలు అందరికి నచ్చుతాయి.. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారంటున్న పవర్‌‌స్టార్..