ప్రకాశం జిల్లా విష్ణుముసురుపల్లిలో విషాదం, సగిలేరువాగులో దిగిన ముగ్గురు బాలికలు నీటిలోకి జారిపడి మృతి
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం విష్ణు ముసురుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పొలం నుంచి తిరిగి వస్తూ సగిలేరు వాగులో దిగిన ముగ్గురు బాలికలు నీటిలో జారిపడి...
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం విష్ణు ముసురుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పొలం నుంచి తిరిగి వస్తూ సగిలేరు వాగులో దిగిన ముగ్గురు బాలికలు నీటిలో జారిపడి మృతి చెందారు. మృతి చెందిన బాలికలను సుప్రియ(13), వెంకట దీప్తి(13), సుస్మిత(10)గా గుర్తించారు. వీరంతా ఒకే గ్రామానికి చెందిన అన్నదమ్ముల బిడ్డలు. అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కునేందుకు వాగులోకి దిగిన ముగ్గురు బాలికలు, ఒక్కసారిగా నీటిలోకి జారిపడి నీటమునిగి చనిపోయారని స్థానికులు చెబుతున్నారు.
బాలికలు నీట మునగడం చూసిన బాలుడు వెంటనే దగ్గరలో ఉన్న బాలికల బంధువులకు సమాచారం చేరవేయడంతో వెంటనే అక్కడికి చేరుకున్న బంధువులు బాలికలను రక్షించేందుకు ప్రయత్నించారు. బాలికల్ని హుటాహుటీన గిద్దలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలికలు మృతి చెందారని డాక్టర్లు తెలపడంతో బాలికల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇదికూడా చదవండి : ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఇక సాకారం, అతి త్వరలోనే సాగు, తాగునీటిని అందించే బృహత్తర ప్రాజెక్టు ఆవిష్కృతం