Gstsuvidhakendra: పెద్దగా పెట్టుబడి లేకుండా జీఎస్టీ సువిధ కేంద్రంతో రెండు చేతులా సంపాదించవచ్చు.. అదెలాగంటే..
Gstsuvidhakendra: దేశంలో జీఎస్టీ విధానం తీసుకువచ్చినప్పటి నుంచి జీఎస్టీ సలహాదారులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. కేంద్రం తీసుకువచ్చిన
Gstsuvidhakendra: దేశంలో జీఎస్టీ విధానం తీసుకువచ్చినప్పటి నుంచి జీఎస్టీ సలహాదారులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. కేంద్రం తీసుకువచ్చిన ఈ విధానంలో వ్యాపారవేత్త వార్షిక టర్నోవర్ ఆధారంగా జీఎస్టీని దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే జీఎస్టీ విధానాన్ని తీసుకువచ్చి ఇన్నేళ్లు అవుతున్నప్పటికీ.. దానిపై ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేదనేది వాస్తవం. గ్రామాల్లోనే కాదు.. చిన్న, పెద్ద నగరాల్లో కూడా జీఎస్టీని ఎలా దాఖలు చేయాలో చాలా మందికి తెలియదు. అటువంటి పరిస్థితిలో, వారికి అకౌంటింగ్ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా అవసరం అవుతున్నారు అందుకోసం కొందరు జీఎస్టీ సమాచారం గురించి ఇతరుల నుంచి తెలుసుకోవడం గానీ, జీఎస్టీ ఫెసిలిటేషన్ సెంటర్‌కు వెళ్లడం గానీ చేస్తున్నారు. జీఎస్టీ సువిధ కేంద్రం ఈ విషయంలో ఎంతో కీలకమని చెప్పాలి. ఎంతో ప్రజల సందేహాలను ఈ కేంద్రం నివృత్తి చేయడమే కాకుండా, ఈ సెంటర్ ద్వారా మరెంతో మందికి జీవనోపాధి లభిస్తోంది.
జీఎస్టీ సువిధ కేంద్రం ఒక సాధారణ సేవా కేంద్రం లాంటిది. ఇక్కడ జీఎస్టీని దాఖలు చేయడమే కాకుండా, అనేక ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి సేవకు నిర్ణీత రుసుము ఉంటుంది. నిరుపేదల పని తేలికగా జరుగుతుంది. అదే సమయంలో జీఎస్టీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న వ్యక్తికి మంచి కూడా ఆదాయం లభిస్తుంది. అంటే ఈ కేంద్రం ద్వారా కస్టమర్లతో పాటు, కేంద్రం నిర్వాహకులూ లబ్ధిపొందుతారు. అయితే, జీఎస్టీ సువిధ కేంద్రాన్ని ఎవరైనా ఏర్పాటు చేయవచ్చు. మరి దానిని ఎలా ఏర్పాటు చేయాలి, అర్హతలు ఏం ఉండాలి వంటి ఇతర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పెద్ద స్థలం, పెద్దగా పెట్టుబడి అసరం లేదు.. Gstsuvidhakendra.org ప్రకారం, ఎవరైనా జీఎస్టీ ఫెసిలిటేషన్ సెంటర్‌ను తెరవవచ్చు. దీనికి ఎక్కువ మూలధనం అవసరం లేదు. అంతేకాదు.. సెంటర్ తెరవాలంటే సదరు వ్యక్తులు సిఎ, పీహెచ్‌డీ లు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక జీఎస్టీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు దుకాణం వంటి పెద్ద స్థలాలు కూడా అవసరం లేదు. ఇది ప్రభుత్వ పథకం కానప్పటికీ.. ఫ్రాంచైజ్ మాత్రం అవసరం. ఇదిలాఉంటే, జీఎస్టీ ఫెసిలిటేషన్ సెంటర్‌ను ప్రారంభించడం ద్వారా మీరు ఎన్ని రకాల సేవలను అందించవచ్చునో, డబ్బుల ఎలా సంపాదించగలమో ఇప్పుడు తెలుసుకుందాం.
జీఎస్టీ ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఏ సేవలు అందుబాటులో ఉంటాయంటే.. 1. ప్రభుత్వ సేవలు – జీఎస్టీ ఫెసిలిటేషన్ సెంటర్‌లో అనేక రకాల ప్రభుత్వ సేవలను అందించవచ్చు. భీమా, పెన్షన్ సంబంధిత సౌకర్యాలు, ఇ-సిటిజన్ , ఇ-డిస్ట్రిక్ట్ సేవలు, ఓటరు I కార్డ్ మొదలైనవి, ఆధార్ కార్డ్ సంబంధిత సేవలు (ఫ్రాంచైజీతో), ఇ-కోర్ట్, డిజిటల్ ఇండియాకు సంబంధించిన ఇతర సేవలు మొదలైనవి. 2. ఆర్థిక సేవలు – సిఎ సర్టిఫికేషన్, ఆదాయపు పన్ను రిటర్న్ మరియు ఆడిట్, ఉద్యోగ ఆధార్, జిఎస్టి రిటర్న్ ఫైలింగ్, డిఎస్సి మరియు అకౌంటింగ్ సేవలు అందించవచ్చు. 3. ఇతర సేవలు – క్రెడిట్ కార్డ్ సర్వీస్, మనీ ట్రాన్స్ఫర్, ప్రీ-పెయిడ్ కార్డ్ సర్వీస్, ఆధార్ మనీ ట్రాన్స్ఫర్, రిజల్ట్స్, రైలు, విమాన టికెట్ల బుకింగ్, ఇతర ఆన్‌లైన్ సేవలు. కంప్యూటర్, ఇంటర్నెట్ గురించి కొంచెం పరిజ్ఞానం, ఇతర విషయాల గురించి మరికొంత తెలుసుకుంటే.. ఈ సేవలన్నింటిలోనూ రాణించవచ్చు. తద్వారా డబ్బు సంపాదించవచ్చు.
జీఎస్టీ ఫెసిలిటేషన్ సెంటర్ ప్రారంభించడానికి ఉండాల్సిన కనీస అర్హత.. (జీఎస్టీ సువిధా కేంద్ర అర్హత ప్రమాణాలు) 1. కనీసం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించాలి. 2. జీఎస్టీపై కనీస పరిజ్ఞానం ఉంటే చాలు. దాంతోపాటు కొద్దిగా అకౌంటింగ్ పైనా పరిజ్ఞానం ఉండాలి. 3. కంప్యూటర్, ఇంటర్నెట్ గురించిన ప్రాథమిక విషయాలు తెలిసి ఉండాలి.
జీఎస్టీ ఫెసిలిటేషన్ సెంటర్ తెరవడానికి ఏమేం కావాలి..? (జీఎస్టీ సువిధా కేంద్రానికి సంబంధించిన కొన్ని ఉపకరణాలు, పరికరాలు) 1. జీఎస్టీ సువిధ కేంద్రాన్ని తెరవడానికి మీకు కనీసం తగినంత స్థలం ఉండాలి. 100–150 చదరపు మీటర్ల స్థలం సరిపోతుంది. 2. అదనంగా మీకు కొన్ని పరికరాలు అవసరం. కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్‌లు, స్కానర్‌లు, మోర్ఫో పరికరాలు వంటివి. ఇంటర్నెట్ కనెక్షన్, విద్యుత్ సౌకర్యం మొదలైనవి ఉండాలి. 3. మీరు డేటా ఎంట్రీ మరియు కొన్ని చిన్న పని కోసం అవసరమైతే ఒక ఎంప్లాయ్‌ని కూడా నియమించుకోవచ్చు. తరువాత, అవసరానికి అనుగుణంగా ఇతర వ్యక్తులకు కూడా ఉపాధి ఇవ్వవచ్చు.
జీఎస్టీ ఫ్రాంచైజీని ఎవరు ఇస్తారు? జీఎస్టీ కేంద్రాన్ని తెరవడానికి మీరు ఫెసిలిటీ ప్రొవైడర్ అనుమతి పొందాలి. జీఎస్టీ ఫెసిలిటీ ప్రొవైడర్లు జీఎస్టీ నెట్‌వర్క్‌తో అనుసంధానించబడ్డారు. సిఎస్‌సి, వక్రంజీ, వికె వెంచర్, వాన్విక్ టెక్ సొల్యూషన్ వంటి సంస్థలు దీనికి ఫ్రాంచైజీలను ఇస్తాయి. ఇవి కాకుండా, మాస్టర్ జీఎస్టీ, బాట్రీ సాఫ్ట్‌వేర్, మాస్టర్ ఇండియా, వేప్ డిజిటల్ సర్వీసెస్ వంటి మరికొన్ని సంస్థలు భాగస్వామ్యంతో పనిచేస్తాయి. జీఎస్టీ సువిధా కేంద్రం కోసం రెండు విధాలుగా ఫ్రాంచైజీని తీసుకోవచ్చు. ఇందుకోసం ఏదైనా సంస్థ యొక్క వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దీని కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే gstsuvidhakendra.org తరపున ట్వీట్ చేయడం ద్వారా ఈ కేంద్రాన్ని తెరవడానికి చాలా సులభమైన మార్గం అని చెప్పవచ్చు. దీనిపై మరింత సమాచారం కోసం 1800 108 8888 నెంబర్ కు కూడా కాల్ చేయవచ్చు.
జీఎస్టీ ఫెసిలిటేషన్ సెంటర్ ప్రారంభించడానికి ఎంత పెట్టుబడి అవసరం.. (జీఎస్టీ సువిద కేంద్ర పెట్టుబడులు): జీఎస్టీ సువిధ కేంద్రాన్ని తెరవడానికి కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రద్దీ ప్రాంతాల్లోనే సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. దీని వల్ల డబ్బు కూడా సేవ్ అవుతుంది. అయితే, ఇంతకు ముందు చెప్పినట్లుగా సువిధ కేంద్రానికి అవసరమైన పరికరాలు మాత్రం తప్పనిసరిగా అవసరం. వీటిని కోనుగోలు చేయడానికి దాదాపు రూ. 60 నుంచి రూ. 70 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో మొబైల్ ద్వారా కూడా కొన్ని సేవలను అందించవచ్చు. కాని తరువాత మాత్రం తప్పనిసరిగా ఇంటర్నెట్ సదుపాయం అవసరం పడుతుంది. దీనికోసం గరిష్టంగా నెలకు రూ. 600 వ్యయం అవ్వొచ్చు. ఇక విద్యుత్ కనెక్షన్ వంటి ఇతర చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే, సువిధ సెంటర్ ఏర్పాటు సమయంలో సుమారు రూ. ఒక లక్ష వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత పెద్దగా ఖర్చు ఉండదు. పైనాగా ఆదాయం కూడా వస్తుంది.
సువిధ కేంద్రం ద్వారా డబ్బు సంపాదన ఎలా? జీఎస్టీ సువిధ కేంద్రం ద్వారా డబ్బు సంపాదించడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జీఎస్టీ సువిధ కేంద్రం ద్వారా తక్కువ పెట్టుబడిలో ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. ఇందులో 2 విధాలుగా సంపాదించవచ్చు. సంస్థ ద్వారా నడుస్తున్నందుకు నిర్వాహకులకు కమీషన్ అందుతుంది. అదేలాగంటే.. జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం కంపెనీ 500 రూపాయలు వసూలు చేస్తే, అందులో 30 నుండి 40 శాతం అంటే రూ. 200 వరకు చేస్తారు. కొత్త జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం కంపెనీ 750 రూపాయలు వసూలు చేస్తే, అందులో సువిధ కేంద్రం నిర్వాహకుల వాటాగా రూ. 300 వరకు లభిస్తుంది. ఇది కాకుండా, డిజిటల్ సంతకం కోసం కస్టమర్ల నుండి 700 రూపాయలు తీసుకుంటే, అది కూడా 40 శాతం లభిస్తుంది. అంటే నిర్వాహకులకు రూ. 280 వాటా వస్తుంది. ఇది కాకుండా, జీఎస్టీకి అదనంగా కొన్ని అదనపు ఫీచర్లను ఇవ్వడం ద్వారా కస్టమర్ల నుంచి కొంత ఆదాయం వస్తుంది. ఇతర సేవలు అందించినందుకు గానూ ఆదాయం వస్తుంది.
GST Suvidha Kendra:
Start #GST Suvidha Kendra – Your own business in any city or village. 24 days Trainings & get 25 years of license. You can provide more than 200+ services to your customers online.
Be a part of #digitalindia & become self dependent.https://t.co/KrHsX7lgpJ
— GSTSuvidhaKendra (@gstsuvidha_gsk) February 5, 2021
Also read:
Robot Fish: చేపల్లాంటి చేపలు.. కానీ ఇవి ‘రోబోలు”.. నీటి అడుగున ఇవి ఏం చేస్తాయో తెలుసా..