5G Mobiles: 5జీ మొబైల్‌ తయారీలోకి దేశీయ మొబైల్‌ సంస్థ… అతి త్వరలో భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న..

Micromax Launching 5g Mobile: విదేశీ మొబైల్‌ కంపెనీలు భారత మార్కెట్లో దూసుకెళుతోన్న సమయంలో వచ్చిందే మైక్రోమాక్స్‌. భారత్‌కు చెందిన ఈ సంస్థ తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లు తీసుకొస్తూ వినియోగదారుల ఆదరణ చోరగొంది. మారుతోన్న...

5G Mobiles: 5జీ మొబైల్‌ తయారీలోకి దేశీయ మొబైల్‌ సంస్థ... అతి త్వరలో భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 11, 2021 | 5:07 PM

Micromax Launching 5g Mobile: విదేశీ మొబైల్‌ కంపెనీలు భారత మార్కెట్లో దూసుకెళుతోన్న సమయంలో వచ్చిందే మైక్రోమాక్స్‌. భారత్‌కు చెందిన ఈ సంస్థ తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లు తీసుకొస్తూ వినియోగదారుల ఆదరణ చోరగొంది. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ సమయంలో మారుతోన్న సాంకేతికతకు అనుగుణంగా… మైక్రోమ్యాక్స్‌ 5జీ మొబైళ్ల తయారీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే అతి త్వరలోనే భారత మార్కెట్‌లోకి 5జీ మొబైళ్లను తీసుకురాన్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మ ప్రకటించారు. బెంగళూరులోని రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌లో 5జీ మొబైల్‌ కోసం ఇంజినీర్లు పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ మొబైళ్లు ఎప్పుడు వస్తాయనేదానిపై నిర్ధిష్ట సమయం చెప్పకపోవడం గమనార్హం. ఇక మైక్రోమ్యాక్స్‌ 5జీ మొబైల్‌లో 6జీబీ ర్యామ్‌, రిఫ్రెష్‌ రేట్‌, లిక్విడ్‌ కూలింగ్‌ సదుపాయాలను తీసుకురాన్నట్లు సమాచారం. వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన ఎక్స్‌పీరియన్స్‌ను అందించే క్రమంలో.. ఇన్‌1బి మోడల్‌ కోసం సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అందించనున్నట్లు రాహుల్‌ శర్మ తెలిపారు. ఇప్పటికే విదేశీ బడా కంపెనీలు 5జీ రంగంలో ముందు వరుసలో ఉండగా.. ప్రస్తుతం అడుగుపెడుతోన్న దీశీయ మైక్రోమ్యాక్స్‌ ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.

Also Read:Indian APP: ట్విట్టర్‌కి పోటీగా దూసుకువస్తున్న స్వదేశీ యాప్.. కేంద్ర మంత్రి ప్రకటనలో ఒక్కసారిగా హైప్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!