Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian APP: ట్విట్టర్‌కి పోటీగా దూసుకువస్తున్న స్వదేశీ యాప్.. కేంద్ర మంత్రి ప్రకటనలో ఒక్కసారిగా హైప్..

Social Media App: ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌కు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. దేశాధినేతలు మొదలు.. సాధారణ ప్రజలు వరకు ట్విట్టర్‌ను వాడుతున్నారు.

Indian APP: ట్విట్టర్‌కి పోటీగా దూసుకువస్తున్న స్వదేశీ యాప్.. కేంద్ర మంత్రి ప్రకటనలో ఒక్కసారిగా హైప్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 10, 2021 | 3:02 PM

Social Media App: ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌కు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. దేశాధినేతలు మొదలు.. సాధారణ ప్రజలు వరకు ట్విట్టర్‌ను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌కు పోటీగా పలు యాప్‌లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ముఖ్యంగా మేకిన్ ఇండియా పిలుపు నేపథ్యంలో భారత్‌లో ట్విట్టర్‌కు పోటీగా ‘కూ’ యాప్ వచ్చింది. తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ‘కూ’ యాప్‌లో అకౌంట్ తెరిచినట్లు ప్రకటించారు. దాంతో ఒక్కసారిగా ఈ స్వదేశీ యాప్‌కు ఎనలేని ప్రచారం వచ్చింది. అలాగే.. ఈ యాప్‌‌ను మేక్ ఇన్ ఇండియా యాప్ అని కితాబిచ్చారు మంత్రి పీయూష్ గోయల్. త్వరలోనే దీనికి అధికారిక మద్ధతు పలికే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఇక మరో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ కూడా గతంలోనే ‘క్యూ’ యాప్‌లో అకౌంట్‌ను ప్రారంభించారు. ఆయన మాత్రమే కాదు.. ఇండియా పోస్ట్‌ సహా పలు ప్రభుత్వ శాఖల పేరిట ‘కూ’ యాప్‌ అకౌంట్లు తెరిచి పరిశీలించారు కూడా. మరికొన్ని ప్రభుత్వ శాఖల పేరిట ‘కూ’ యాప్‌లో అకౌంట్లు తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని సమాచారం.

ఇదిలాఉంటే.. వాస్తవానికి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ‘కూ’ యాప్‌ని 10 నెలల క్రితమే ఆవిష్కరించారు. ట్విట్టర్‌ను పోలిన ఈ ‘కూ’ యాప్‌ను అపారమేయ రాధాకృష్ణ, మయంక్ బిదావడ్క లు డెవలప్ చేశారు. ఈ యాప్‌ భారతీయ భాషలైన తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, తమిళం, మలయాళం, గుజరాతీ, పంజాబీ, ఒడిశా, మరాఠీ, అస్సామీ తదితర భాషలలో అందుబాటులో ఉండగా.. యూజర్లు తమ తమ భాషలలో తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇదిలాఉంటే.. ఈ ‘కూ’ యాప్ ఆత్మనిర్భర్ యాప్‌ ఛాలెంజ్‌లో విజేతగా కూడా నిలిచింది. అయితే, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఒక్కొక్కరుగా ఈ స్వదేశీ యాప్‌లో అకౌంట్ తెరుస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టి ‘కూ’ యాప్‌‌పై పడింది. మరి భవిష్యత్‌తో ట్విట్టర్‌ను ‘కూ’ యాప్ బీట్ చేస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

ఇకపోతే, ట్విట్టర్‌పై ఇటీవల కాలంలో విపరీతమైన విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అసత్య ప్రచారాలకు ట్విట్టర్ కూడా ఒక సాధనంగా మారిందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారత్ విషయానికి వస్తే.. రైతు ఉద్యమం సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో భారత ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ప్రభుత్వం ట్విట్టర్ ఇండియాకు వార్నింగ్ కూడా ఇచ్చింది.

Also read:

Maori MP Rawiri Ejected: టై కొట్టుకోలేదని చట్ట సభ నుంచి ఎంపీ ని సస్పెండ్ చేసిన స్పీకర్.. ఎక్కడో తెలుసా..!