AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter Starts Blocking Accounts: తప్పుడు సమాచార వ్యాప్తికి కారణమయ్యే ఖాతాల బ్లాక్, శ్రీకారం చుట్టిన ట్విటర్, త్వరలో మరిన్ని చర్యలు

తప్పుడు సమాచారం, రెచ్ఛగొట్టే కంటెంట్ తో కూడిన ఖాతాలను ట్విటర్ బ్లాక్ చేయడం ప్రారంభించింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు..

Twitter Starts Blocking Accounts: తప్పుడు సమాచార వ్యాప్తికి కారణమయ్యే ఖాతాల బ్లాక్, శ్రీకారం చుట్టిన ట్విటర్, త్వరలో మరిన్ని చర్యలు
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 10, 2021 | 12:35 PM

Share

Twitter Starts Blocking Accounts: తప్పుడు సమాచారం, రెచ్ఛగొట్టే కంటెంట్ తో కూడిన ఖాతాలను ట్విటర్ బ్లాక్ చేయడం ప్రారంభించింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి పలువురు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, వారి అకౌంట్లను నిలిపివేయాలని కేంద్రం ట్విటర్ ను కోరిన విషయం గమనార్హం. అలాగే హానికరమైన హ్యాష్ ట్యాగ్ లను కుదించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా ఈ సాధనం హామీ ఇచ్చింది. అయితే ఇండియాలో మాత్రమే ఈ ‘బ్లాకింగ్’ ఉంటుందని, జర్నలిస్టులు, మీడియా సారథులు, యాక్టివిస్టులు, రాజకీయ నేతల ట్వీట్లను ఈ బ్లాకింగ్ లో చేర్చలేదని ట్విటర్ స్పష్టం చేసింది. ఇలా చేస్తే భారతీయ చట్టాలకింద వీరి భావ ప్రకటన స్వేచ్చహక్కును తాము అతిక్రమించినట్టు అవుతుందని పేర్కొంది.

ఒక నివేదిక ప్రకారం, ఫార్మర్ జీనోసైడ్‌తో గల 257 ఖాతాలకు గాను 126 ఖాతాలను డీయాక్టివేట్ చేసినట్టు తెలుస్తోంది. కొన్ని రోజులక్రితమే వీటిని బ్లాక్ చేసినప్పటికీ ఈ కంటెంట్ కి వార్తాపరంగా విలువ ఉందని భావించి మళ్ళీ యాక్టివేట్ చేశారు. ఐటీ శాఖ తాజాగా ఇండియాలో 1178 అకౌంట్లను రద్దు చేయాలని ట్విటర్ ను కోరింది. వీటిలో ఖలిస్తానీ సానుభూతిపరులు లేదా పాకిస్థాన్ మద్దతుదారుల అకౌంట్లు ఉన్నాయని, ఇవి దేశ భద్రతకు ముప్పు కలిగించేవని సెక్యూరిటీ సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు కోరింది. తమ ఆదేశాలను పాటించేందుకు ట్విటర్ అంగీకరించిందని ప్రభుత్వం తెలిపింది. కాగా-ఈ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ కు తాజాగా ట్విటర్ ఈ-మెయిల్ చేస్తూ చర్చలకు తాము సమ్మతమేనని వెల్లడించింది. ఇండియా, సౌత్ ఏసియాలో ట్విటర్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మహిమా కౌల్ తన వ్యక్తిగత కారణాలను చూపుతూ గతవారం రాజీనామా చేశారు.

Read More:

Republic Day Violence: ఢిల్లీ అలర్ల కేసులో మరో కీలక సూత్రధారి ఇక్బాల్ అరెస్ట్.. పంజాబ్‌లో పట్టుకున్న స్పెషల్ సెల్..

Oscars 2021: ఆస్కార్ రేసు నుంచి తప్పుకున్న ‘జల్లికట్టు’.. భారత సినిమాకు మరోసారి తీవ్ర నిరాశే..