ఉత్తరాఖండ్ విషాదం, 32 మృత దేహాల వెలికితీత, 197 మంది మిస్సింగ్, ఇంకా సహాయ చర్యల్లో సిబ్బంది

ఉత్తరాఖండ్  విషాద ఘటనలో 32 మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికి తీశారు. 197 మంది జాడ తెలియడంలేదని అధికారులు తెలిపారు. చమోలీ జిల్లాలో

ఉత్తరాఖండ్ విషాదం, 32 మృత దేహాల వెలికితీత, 197 మంది మిస్సింగ్, ఇంకా సహాయ చర్యల్లో సిబ్బంది
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 10, 2021 | 12:52 PM

ఉత్తరాఖండ్  విషాద ఘటనలో 32 మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికి తీశారు. 197 మంది జాడ తెలియడంలేదని అధికారులు తెలిపారు. చమోలీ జిల్లాలో గత ఆదివారం రిషిగంగా, అలకానంద నదులకు పోటెత్తిన వరదలు, గ్లేసియర్ ఔట్ బరస్ట్ పెను ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. నేషనల్  థర్మల్ పవర్ కార్పొరేషన్ కి చెందిన  480 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే తపోవన్ విష్ణుగడ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, 13.2 మెగావాట్ల పవర్ ను ఉత్పత్తి చేసే రిషిగంగా హైడల్ ప్రాజెక్టు ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా దారుణ నష్టాన్ని చవి చూశాయి. ఇలా ఉండగా .. జాడ తెలియనివారికోసం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తదితర బృందాలు ఇంకా గాలిస్తున్నాయి. అతి మారుమూల గ్రామాలకు  వీరు  మందులు, రేషన్ తదితర సరకులను తీసుకువెళ్లి నిరాశయులకు అందించేందుకు  అతి దుర్భేద్యమైన కొండ ప్రాంతాల్లో ప్రయాణించడం చూశానని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ట్వీట్ చేశారు. అటు- 2.5 కి.మీ. పొడవైన హెడ్ రేస్ టన్నెల్ లో ఇంకా సుమారు 25 మంది నుంచి 35 మంది వరకు చిక్కుకునిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు.

డెహ్రాడూన్ లోని వాడియా ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందిన నిపుణుల బృందాలు రెండు నిన్న చమేలీ జిల్లాను విజిట్ చేశాయి. మెరుపు వరదలకు కారణాలను వీరు విశ్లేషిస్తున్నారు. ఈ బృందాలు సాధారణ, హెలికాఫ్టర్ సర్వేలు నిర్వహించాయి.

Also Read:

వారానికి 4 రోజులు పనిచేస్తే చాలు.. 3 రోజులు సెలవులు.. నయా రూల్స్ తేస్తోన్న కేంద్రం..

Twitter Starts Blocking Accounts: తప్పుడు సమాచార వ్యాప్తికి కారణమయ్యే ఖాతాల బ్లాక్, శ్రీకారం చుట్టిన ట్విటర్, త్వరలో మరిన్ని చర్యలు