Australian Open 2021: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఇంటిముఖం పట్టిన టాప్ సీడ్ ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా..!
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టాప్ సీడ్ ఆటగాళ్లకు నిరాశే మిగిలింది. పురుషుల డబుల్స్ నుంచి భారత ఆటగాడు రోహన్ బోపన్న జోడీ ఓటమిని మూటగట్టుకుంది. మాజీ యూఎస్ ఓపెన్..
Australian Open 2021: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టాప్ సీడ్ ఆటగాళ్లకు నిరాశే మిగిలింది. పురుషుల డబుల్స్ నుంచి భారత ఆటగాడు రోహన్ బోపన్న జోడీ ఓటమిని మూటగట్టుకుంది. మాజీ యూఎస్ ఓపెన్ విజేత ఆండ్రెస్కు సైతం టోర్నీ నుంచి నిష్క్రమించింది.రెండో రౌండ్‌లో తైవాన్ ప్లేయర్ సై సు వీ చేతిలో 6-3, 6-2 తేడాతో పరాజయం పాలైంది. ఏ రౌండ్‌లోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ప్రత్యర్థి ముందు ఆండ్రెస్కు నిలవలేకపోయింది. తాను ఓడిపోయినప్పటికీ.. తిరిగి ఆటలోకి రావడం సంతోషంగా ఉందని వెల్లడించింది అండ్రెస్క్.
2019 యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనా విలియమ్స్‌ను మట్టికరిపించి టైటిల్ సొంతం చేసుకున్న ఆండ్రెస్కు.. ఆ తర్వాత మోకాలి గాయం కారణంగా 2020లో ఆడలేక పోయారు. తిరిగి ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో మళ్లీ రాకెట్పట్టారు.
ఇదిలావుంటే…సెరెనా విలియమ్స్ విజయాల పరంపరను మొదలు పెట్టారు. సెర్బియన్ ప్లేయర్ నైనా స్టోజనోవిక్‌తో జరిగిన గేమ్‌లో సెరెనా విలియమ్స్ ఓడిచారు. 6-3, 6-0 తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేశారు. మొదటి రౌండ్గెలిచి ఆదిపత్యంను సెరెనా ప్రదర్శించారు. ఇక రెండో రౌండ్‌లో సెరెనా ముందు కనీసం నిలవలేకపోయింది నైనా.
ఈ టోర్నీలో మరో ఆటగాడికి కూడా దారుణమైన దురదృష్టం వెంటాడింది. గత ఎనిమిదేళ్ల తర్వాత టాప్ టోర్నీ ఆడుతున్న కెనడా క్రీడాకారిణి రెబెక్కా మారినో కూడా ఓటమిని మూటగట్టుకుంది. 19వ సీడ్ ప్లేయర్ మార్కెటా వండ్రోసోవా చేతిలో 6-1, 7-5 తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
పురుషుల సింగిల్స్‌లో రష్యా ఆటగాడు అస్లాన్ కరత్సేవ్ చేతిలో బెలారస్ ఆటగాడు ఎగోర్ గెరాసిమోవ్ ఓడిపోయాడు. 6-0, 6-1, 6-0 తేడాతో ఘోర ఓటమిని చవిచూశాడు. మరో వైపు, ఫ్రెంచ్ ఆటగాడు అలెగ్జాండర్ ముల్లర్‌పై అర్జెంటీనా క్రీడాకారుడు డియెగో స్క్వార్ట్జ్మాన్ విజయం సాధించాడు.
ఇక పురుషుల డబుల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో రోహన్ బోపన్న జోడీ ఓడిపోయింది. జపాన్ఆటగాడు బెన్ మెక్లాచ్లన్తో జతకట్టిన బోపన్న.. కొరియా ప్లేయర్ల చేతిలో పరాజయం మూటగట్టుకున్నాడు.
ఇవి కూడా చదవండి :
Telangana: తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా 157 పాజిటివ్ కేసులు, ఒకరు మృతి..