AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆట మధ్యలో అర్జెంట్ గా టాయిలెట్‌… అనుమతి ఇవ్వని అంపైర్.. అతగాడు ఏంచేసాడో తెలుసా..

టెన్నిస్ మ్యాచ్ మధ్యలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టెన్నిస్ ఆడుతున్న అతగాడికి అర్జెంట్ గా టాయిలెట్ వచ్చింది. అయితే అతనికి చైర్ అంపైర్ అనుమతి ఇవ్వలేదు.

ఆట మధ్యలో అర్జెంట్ గా టాయిలెట్‌... అనుమతి ఇవ్వని అంపైర్.. అతగాడు ఏంచేసాడో తెలుసా..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 11, 2021 | 12:30 AM

Australian Open:  టెన్నిస్ మ్యాచ్ మధ్యలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టెన్నిస్ ఆడుతున్న అతగాడికి అర్జెంట్ గా టాయిలెట్ వచ్చింది. అయితే అతనికి చైర్ అంపైర్ అనుమతి ఇవ్వలేదు. దాంతో అతడు చిందులు తొక్కాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 12వ ర్యాంక్ ఆటగాడు డెనీస్ షాపోలపోవ్ జన్నిక్ సిన్నర్‌తో పోటీపడ్డారు. ఈ ఇద్దరి మధ్య హోరాహోరీగా ఆటసాగింది. అప్పటికే మ్యాచ్ నాలుగు సెట్లు పూర్తిచేసుకుంది. ఐదో సెట్ కు రెడీ అవుతున్న సమయంలో సెట్ మొదలయ్యే ముందు తనను టాయిలెట్‌కు వెళ్లనివ్వాలని అంపైర్‌ను అడిగాడు. దీనికి అంపైర్ నో చెప్పడంతో .. ‘‘నన్ను టాయిలెట్‌కు వెళ్లనివ్వకపోతే ప్యాంటులోనే పోసేలా ఉన్నా.. లేదంటే ఆ బాటిల్‌లో పోస్తా. మీరు ఆటగాళ్లను టాయిలెట్‌కు కూడా వెళ్లనివ్వరా? ఇదెక్కడి రూల్?  అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు డెనీస్ షాపోలపోవ్ .

మరిన్ని ఇక్కడ చదవండి : 

మళ్లీ బ్యాట్ పట్టనున్న క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్.. ట్విట్టర్ వేదికగా అభిమానులు ఆనందం..