మళ్లీ బ్యాట్ పట్టనున్న క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్.. ట్విట్టర్ వేదికగా అభిమానులు ఆనందం..

Sachin Tendulkar News: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. మైదానంలోకి దిగి సత్తా చాటేందుకు సిద్దమయ్యాడు. రోడ్...

మళ్లీ బ్యాట్ పట్టనున్న క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్.. ట్విట్టర్ వేదికగా అభిమానులు ఆనందం..
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 10, 2021 | 7:18 PM

Sachin Tendulkar News: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. మైదానంలోకి దిగి సత్తా చాటేందుకు సిద్దమయ్యాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా దిగ్గజ క్రికెటర్లు మరోసారి బ్యాట్ పట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ టీ20 సిరీస్ రాయ్‌పూర్‌లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో మార్చి 2 నుంచి 21 వరకు జరగనుంది. కరోనా కారణంగా గతేడాది వాయిదా పడిన మిగిలిన మ్యాచ్‌లన్నీ కూడా జరగనున్నాయి.

ఈ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, బ్రెట్‌లీ, దిల్షాన్, మురళీధరన్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, విండీస్ జట్ల నుంచి పలువురు దిగ్గజ ఆటగాళ్లు పాల్గొననున్నారు.

దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజును దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించేందుకు ఈ సిరీస్‌ను ఏర్పాటు చేశారు. సునీల్ గవాస్కర్ ఈ సిరీస్‌కు కమిషనర్‌గా.. సచిన్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా, మాస్టర్ బ్లాస్టర్ చాలా రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతుండటంతో అభిమానుల ఆనందం అవధులు దాటుతోంది. సోషల్ మీడియా వేదికగా క్రికెట్ గాడ్‌కు తిరిగి స్వాగతం పలుకుతున్నారు.

ఆ ట్వీట్లు ఇలా ఉన్నాయి..

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: చావు దారిదాపుల్లోకి వెళ్లొచ్చాడు.. 70 అడుగుల ఎత్తు నుంచి పడి ప్రాణాలతో తిరిగొచ్చాడు..

12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!

ఫస్ట్ నైట్ రోజు భార్యను పట్టించుకోకుండా.. కంప్యూటర్‌తో.. నెట్టింట్లో రచ్చ.. రచ్చ..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో