Former Minister P Chidambaram Slams Budget 2021: ‘ఈ బడ్జెట్ ను తిరస్కరిస్తున్నాం’ రాజ్యసభలో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం ఫైర్
ఈ నెల 1 న కేంద్రం పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ ను తిరస్కరిస్తున్నామని మాజీకేంద్ర మంత్రి పి.చిదంబరం అన్నారు. బడ్జెట్ పై గురువారం రాజ్యసభలో..
Former Minister P Chidambaram Slams Budget 2021: ఈ నెల 1 న కేంద్రం పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ ను తిరస్కరిస్తున్నామని మాజీకేంద్ర మంత్రి పి.చిదంబరం అన్నారు. బడ్జెట్ పై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన.. ఇది ధనికులకు మాత్రమే ఉద్దేశించినదని, పేదలకు కాదని అన్నారు. కరోనా పాండమిక్ సమయంలో సుమారు 12 కోట్లమందికి పైగా ఉపాధి కోల్పోయారని, ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమని ఆయన ఆరోపించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 35 శాతం పైగా మూత పడ్డాయని, వెనుకబడిన రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆయన చెప్పారు. తమిళనాడు లాంటి అభివృధ్ది చెందిన రాష్ట్రాల్లో డిమాండ్ గురించిన ప్రస్తావన బడ్జెట్ లో లేదని, ఇక యూపీ, బీహార్, ఒడిశా వంటి వెనుకబడిన రాష్ట్రాల మాట ఏమిటని ఆయన ప్రశ్నించారు. బల్క్ ఆఫ్ ఇండియా ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. 2017-18 కి ముందు ఎక్కడ ఉన్నామో, ఇప్పటికీ అక్కడే ఉన్నామని, మూడేళ్లలో ఎకానమీ క్షీణ దశను ఎదుర్కొందని చిదంబరం వ్యాఖ్యానించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం.. నిపుణులు, ఆర్ధిక నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి దేశాన్ని గాడిలో పెట్టాలని ఆయన అన్నారు. ఈ దేశంలోని అత్యధిక జనాభా గురించి పట్టించుకోకపోతే ఇక ఈ బడ్జెట్ ఎందుకన్నారు. కాగా-లడఖ్ బోర్డర్ పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై చర్చ జరగాలని రాజ్యసభలో విపక్షాలు డిమాండ్ చేశాయి, అయితే చైర్మన్ వెంకయ్యనాయుడు ఇందుకు తిరస్కరించారు.
Read More:
Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఐదు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు
సంగీత దర్శకుడిగా మరెవ్వరూ చేయలేని ప్రయోగాలు, వైవిధ్యభరితమైన పాటలను స్వరపరచిన ఘంటసాల