Robot Fish: చేపల్లాంటి చేపలు.. కానీ ఇవి ‘రోబోలు”.. నీటి అడుగున ఇవి ఏం చేస్తాయో తెలుసా..

చేపలు నీటిలో ఎలా జీవిస్తాయి.. వారి కదలికలను ఎలా సమకాలీకరిస్తాయో తెలుసుకోవడానికి హార్వర్డ్ శాస్త్రవేత్తలు స్వయంగా ఫిష్ రోబోట్లను తయారు

Robot Fish: చేపల్లాంటి చేపలు.. కానీ ఇవి 'రోబోలు.. నీటి అడుగున ఇవి ఏం చేస్తాయో తెలుసా..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 11, 2021 | 2:21 PM

చేపలు నీటిలో ఎలా జీవిస్తాయి.. వారి కదలికలను ఎలా సమకాలీకరిస్తాయో తెలుసుకోవడానికి హార్వర్డ్ శాస్త్రవేత్తలు స్వయంగా ఫిష్ రోబోట్లను తయారు చేశారు. ‘బ్లోబోట్’ అని పిలువబడే ఈ రోబోటిక్ చేపలకు కెమెరాలు, బ్లూ ఎల్ఈడీ లైట్లతో అమర్చారు. ఇవి నీటి అడుగున ఇతరుల ఉన్న మార్గాన్ని మరియు ఎంత దూరంలో ఉన్నరనే విషయాలను గ్రహిస్తాయి. అలాగే ఈత కొట్టెందుకు వీలుగా వాటికి ప్లాపింగ్ రెక్కలను అమర్చారు. నీటి అడుగున వాడే డ్రోన్స్ కంటే వీటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.

రాబోతే తరాలకు ఇవి ఎంతో సహయపడతాయి. ఎలా అంటే సముద్రలో ప్రాణపాయంలో ఉన్న వ్యక్తిని కనుగొని వారిని రక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయని రచయిత ఫ్లోరియన్ బెర్లింగర్ అన్నారు. నీటి అడుగున ఉండే ఈ రోబోట్ వ్యవస్థలు వ్యక్తిగత రోబోట్స్‏తో రేడియో ద్వారా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని మరియు వాటి GPS స్థానాలను ప్రసారం చేయడం పై ఆధారపడి ఉంటాయి. ఈ బ్లూబోట్ రోబోలు చేపల యొక్క సహజ ప్రవర్తనను అనుకరించడానికి ఉపయోగపడుతుంది.

ఈ బ్లూబోట్ రోబోలు 10 సెంటీమీటర్లు (4 అంగుళాలు) పొడవు ఉంటాయి. అలాగే బ్లూ టాంగ్ చేపల మాదిరిగానే వీటిని తయారుచేశారు. బ్లూబోట్ రోబో చేపలు ఇండో పసిఫిక్ పగడపు దిబ్బలకు చెందినవి. రోబోట్లు తమ పరిధిని దృష్టిలో ఇతర రోబోట్లను గుర్తించడానికి అవి వాటికి అమర్చిన కెమెరా “కళ్ళను” ఉపయోగిస్తాయి. తరువాత స్వీయ-ఆర్గనైజింగ్ ప్రవర్తనలో పాల్గొంటాయి. వీటిలో ఒకేసారి వాటి లైట్లను మెరుస్తూ, ఒక రౌండ్ ఏర్పాటు చేసుకోని తమను తాము ఆ రౌండులోకి వచ్చేలా చూసుకుంటాయి. ఈ రోబోట్లు నీటిలోని కాంతిని ప్రసరించే వనరును వెతకడానికి సహకరిస్తాయి. రోబోట్లలో ఒకటి కాంతిని కనుగొన్నప్పుడు, తన చుట్టూ ఉండే మిగతా రోబోట్లకు సంకేతాన్ని పంపిస్తుంది. “చేపల ఈత వాటి జీవపక్రియ అధ్యయనాల కోసం ఈ బ్లూబోట్లను ఫిష్ సర్రోగేట్‌లుగా ఉపయోగించడానికి ఇతర శాస్త్రవేత్తలు తనను సంప్రదించారని” అని బెర్లింగర్ చెప్పారు, ప్రకృతిలో సామూహిక మేధస్సు గురించి మరింత తెలుసుకోవడానికి రోబోట్ సమిష్టి మాకు సహాయపడుతుంది. ఎల్‌ఈడీలు అవసరం లేని విధంగా డిజైన్‌ను మెరుగుపరచాలని మరియు పగడపు దిబ్బల వంటి ప్రయోగశాల సెట్టింగుల బయట కూడా ఉపయోగించవచ్చని ఆయన భావిస్తున్నట్లుగా చెప్పుకోచ్చారు.

Also Read:

డబ్బు పొదుపు చేయాలని చూస్తున్నారా ? నెలకు రూ. 10,000 పెట్టుబడి పెడితే.. రూ. 16 లక్షలు పొందొచ్చు.. వివరాలు ఇవే..