AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMKY Scheme: ఈ పథకంలో మీ పేరు నమోదు చేసుకోండి.. రూపాయి చెల్లించకుండానే నెలకు రూ. 3000 పెన్షన్ అందుకోండి..

PMKY Scheme: రైతుల ప్రయోజనం చేకూర్చేలా కేంద్రం ప్రభుత్వం అనేక పథకాలకు రూపకల్పన చేస్తోంది. వాటిల్లో ప్రధానంగా చూసినట్లయితే

PMKY Scheme: ఈ పథకంలో మీ పేరు నమోదు చేసుకోండి.. రూపాయి చెల్లించకుండానే నెలకు రూ. 3000 పెన్షన్ అందుకోండి..
Shiva Prajapati
|

Updated on: Feb 11, 2021 | 7:35 PM

Share

PMKY Scheme: రైతుల ప్రయోజనం చేకూర్చేలా కేంద్రం ప్రభుత్వం అనేక పథకాలకు రూపకల్పన చేస్తోంది. వాటిల్లో ప్రధానంగా చూసినట్లయితే కిసాన్ సమ్మాన్ నిధి పథకం కీలకం అని చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా 60 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు నెలకు రూ. 3,000 పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 21,19,316 మంది రైతులు పెన్షన్ ను పొందుతున్నారు. చాలా మంది రైతులు ఈ పథకంలో ఇంకా తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ అధికారులు కీలక విషయాలు తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతు పెన్షన్ పొందడం చాలా సులభం అన్నారు. రైతు జేబు నుంచి రూపాయి పెట్టకుండానే.. రైతు పెన్షన్ పొందవచ్చు అని చెబుతున్నారు. ఈ స్కీమ్ ప్రీమియం రైతుల జేబు నుంచి కాకుండా.. కేంద్రం ప్రభుత్వం ఏటా రైతులకు ఇచ్చే రూ. 6000 నుంచే నేరుగా డబ్బు తీసివేయడం జరుగుతుంది. అయితే దీనికోసం రైతు సంబంధిత ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఈ పథకాన్ని 12 సెప్టెంబర్, 2019 న జార్ఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కానీ, దానికంటే ముందే.. అంటే ఆగస్టు 9వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పథకానికి ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజనగా నామకరణం చేశారు. రైతులకు అంకితం చేసిన అతిపెద్ద పెన్షన్ పథకం ఇది. ఇందులో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు 3000 రూపాయల పెన్షన్ లభిస్తుంది.

సగం ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తోంది.. ఈ పథకంలో చేరే రైతులకు సగం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుండగా, మిగిలిన సగం ప్రీమియం కూడా వారి జేబుల్లోంచి కాకుండా.. కేంద్రం ఇచ్చే డబ్బుల్లోంచే తీసుకోవడం జరుగుతుంది. రైతులు ఈ స్కీమ్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా ప్రయోజనాలే ఉన్నాయి. అంతేకాదు.. రైతు తమకు కావాల్సినప్పుడు ఈ స్కీమ్ నుంచి వైదొలగవచ్చు. రైతుల డబ్బు సురక్షితంగా ఉంటుంది. అప్పటి వరకు జమ అయిన సోమ్ముకు వడ్డీ కూడా లభిస్తుంది.

5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా.. ఈ పెన్షన్ పథకం ద్వారా మొదటి దశలో దేశ వ్యాప్తంగా 5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలో చేరిన రైతుకు 60 సంవత్సరాల తరువాత 3000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించిన సర్కార్.. మొత్తంగా 12 కోట్ల మంది చిన్న, స్వల్ప రైతులకు దాని ప్రయోజనాలను అందించేలా ప్రణాళికను రూపొందించింది. దేశంలో చిన్న మరియు ఉపాంత రైతులు 2 హెక్టార్ల వరకు సాగు భూమిని కలిగిన రైతులే అధికంగా ఉన్నారు. వీరిని దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.

కనిష్ట ప్రీమియం రూ. 55, గరిష్టంగా రూ .200.. ఈ పాలసీలో చేరిన రైతు కనిష్ఠంగా రూ. 55 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ. 200 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీదారుడు ఒకవేళ చనిపోతే అతనికి వచ్చే పెన్షన్‌లో సగం పెన్షన్ అతని భార్యకు లభిస్తుంది. అంటే రైతుకు రూ. 3000 పెన్షన్ వస్తే.. అతని మరణానంతరం అతని భార్యకు నెలకు రూ. 1500 పెన్షన్ వస్తుందన్నమాట. రైతులకు ఇచ్చే పెన్షన్ ఫండ్‌ను ఎల్‌ఐసీ సంస్థ ఇస్తోంది. ఎవరైనా పాలసీని మధ్యలో వదిలేసినట్లయితే.. ఆ రైతుకు అప్పటి వరకు చెల్లించిన మొత్తంతో పాటు.. దానికి వడ్డీని కూడా ఇస్తారు.

ఈ పథకంలో ఎలా చేరాలంటే.. 1. పెన్షన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్సి) లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 2. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు ఇవ్వడం తప్పనిసరి. 3. ఈ పథకం ప్రయోజనం పొందకపోతే అట్టి రైతులకు ఖాస్రా-ఖటౌని కాపీ లభిస్తుంది. 4. రెండు పాస్ ఫోటోలు, బ్యాంక్ పాస్‌బుక్ కూడా అవసరం. 5. రిజిస్ట్రేషన్ సమయంలో కిసాన్ పెన్షన్ ప్రత్యేక సంఖ్య, పెన్షన్ కార్డు సృష్టించబడతాయి.