రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ టీ ఎంతో మేలంట.. సలహాలిస్తున్న బాలీవుడ్ హీరోయిన్.

కరోనా మహామ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థతోపాటు, మనిషి మనుగడను అతాలకుతలం చేసింది. దీంతో మనిషి రోగనిరోధక శక్తి తగ్గడంతోపాటు, ప్రస్తుతం వాతావరణ

రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ టీ ఎంతో మేలంట.. సలహాలిస్తున్న బాలీవుడ్ హీరోయిన్.
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 11, 2021 | 12:48 PM

కరోనా మహామ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థతోపాటు, మనిషి మనుగడను అతాలకుతలం చేసింది. దీంతో మనిషి రోగనిరోధక శక్తి తగ్గడంతోపాటు, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులలో దగ్గు, జలుబు, అంటు వ్యాధుల భారీన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో తిరిగి మన జీవన స్థితిని పొందడంతోపాటు, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రారంభించడానికి ఇమ్యూనిట్ పవర్ అనేది చాలా అవసరం. ఇందుకోసం రోజూ వ్యాయామం చేయడం, మంచి నిద్రతోపాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, ఒత్తిడికి తక్కువగా గురవడం అనేవి ఉత్తమం. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై తగిన శ్రద్ధ వహిస్తున్నారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారు ఈ వైరస్ ప్రభావంతో ఎక్కువగా ఇంటి వంటలు తినడానికి ఇష్టపడుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంపోందించేందుకు ఈ గోల్డేన్ టీ సహయపడుతుందని బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి చెప్పుకొచ్చింది. నిమ్మకాయ, పసుపు, అల్లం, తేనేతో చేసిన టీ గురించి ఆమె తన ఇన్‏స్టాలో షేర్ చేసింది.

నిమ్మకాయ, అల్లం మరియు తేనే వంటివి దగ్గు, జలుబు నుంచి ఉపశమనం ఇస్తాయి. పసుపు లేదా మామిడి అల్లం అనేవి అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. వీటితో చేసిన టీని ప్రతి రోజు ఉదయం శిల్పా శెట్టి తన కొడుకు వియాన్ రాజ్‏కు ఐదేళ్ళ వయస్సు నుంచి ఇస్తుందని తెలిపింది. ఈ టీని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ఉంటుంది. ఇది జీర్ణ మరియు శ్వాస కోశ వ్వవస్థలను మెరుగుపరుస్తుంది. అలాగే జీవక్రియను పెంచడానికి, విటమిన్ సి మరియు పోటాషియంను అందిస్తుంది. అలాగే శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సహయపడుతుందని తెలిపింది.

తయారు చేసే విధానం.. రెండు కప్పుల వెచ్చని నీరు; 1.5 నిమ్మకాయ రసం, 1.5 టేబుల్ స్పూన్ తాజా అల్లం రసం, 1 టేబుల్ స్పూన్ తాజా అంబా హల్ది, 2 టేబుల్ స్పూన్ల తేనె, ఒక చిటికెడు గ్రౌండ్ దాల్చినచెక్క మరియు రుచికి కొంచెం ఉప్పు.

ఒక పాత్రలో అన్ని పదార్థాలను వేసి తేనే పూర్తిగా కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలి.. దానిపై ఒక మూత పెట్టి 5-6 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత వడకట్టి ఒక కప్పులోకి తీసుకోవాలి.

ఈ టీతో ప్రయోజనాలు.. 1. తేనే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఇవ్వడంలో తేనే సహయపడుతుంది. 2. అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వికారాన్ని తగ్గిస్తుంది. జీవక్రియను పెంచి, శరీరాన్ని ధృడంగా ఉంచేందుకు సంహయం పడుతుంది. 3. విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహయపడతాయి. 4. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండడం వలన కీళ్ళ నొప్పులు, చర్మంపై దురద, గాయాలను తగ్గిస్తుంది. దగ్గు, అజీర్ణం తగ్గించడానికి సహయపడతాయి.

Also Read:

Jaggery Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం తాగితే కలిగే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు..