Jaggery Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం తాగితే కలిగే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు..

Jaggery Benefits: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనుషులు బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ..

Jaggery Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం తాగితే కలిగే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 10, 2021 | 4:29 PM

Jaggery Benefits: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనుషులు బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారు. కొత్త కొత్త జబ్బులను కొనితెచ్చుకుంటున్నారు. ఆస్పత్రులకు పెరుగెత్తి బేబులను గుల్ల చేసుకుంటాన్నారు. మారిన జీవన శైలే అనారోగ్యానికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలు పాటిస్తే మాత్రం చెక్కు చెదరని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు. ముఖ్యంగా.. పురాతన కాలం నుంచి వస్తున్న వంటింటి చిట్కాలే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది ఊభకాయంతో బాధపడిపోతున్నారు. అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా మంది జిమ్‌లకు పరుగులు తీస్తున్నాయి. అలాంటి వారు రోజూ వెచ్చని బెల్లం పానకం తాగితే తొందరగా బరువు తగ్గడమే కాకుండా.. మరెన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

మరి బెల్లం పానకం వల్ల కలిగే ఉపయోగాలంటే ఇప్పుడు చూద్దాం..

1. ప్రతి రోజూ ఉదయం గోరువెచ్చని బెల్లం పానకం తాగడం వల్ల విసర్జన సాఫీగా జరుగుతంది. 2. ప్రతి రోజూ ఉదయం గోరువెచ్చని బెల్లం పానకం తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. 3. బెల్లం పానకం తాగితే కడుపులోని విష పదార్థాలు బయటకు పోయి జీర్ణసంబంధమైన రుగ్మతలు తగ్గుతాయి. 4. శరీరంలో ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచుతుంది. 5. బెల్లం పానకం తాగడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. 6. ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 7. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను పెంచడమే కాకుండా ఐరన్‌ను అందిస్తుంది. 8. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు సీజన్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. 9. బెల్లంలోనే అనేక ఖనిజ లవణాలు, విటమిన్లు ఉన్నాయి. దాంతో బెల్లం పానకం సేవించడం వల్ల శరీరానికి పుష్కలంగా ఖనిజ లవణాలు, విటమిన్లు అందుతాయి.

Note: బెల్లం అందరికీ పడదు కావున వైద్య నిపుణుల సలహా మేరకు బెల్లం పానకాన్ని స్వీకరించండి.

Also read:

ICC Test Rankings: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ ఓటమి.. దిగజారిన కెప్టెన్ కోహ్లీ ర్యాంక్..

తొలిదశలో 3,244 పంచాయతీలకు గాను, 2,637 స్థానాల్లో వైసీపీ మద్దతు దారులు గెలిచారు : మంత్రి బొత్స