ICC Test Rankings: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ ఓటమి.. దిగజారిన కెప్టెన్ కోహ్లీ ర్యాంక్..

Virat Kohli : ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ తాజాగా విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి భారీ షాక్ తగిలింది.

ICC Test Rankings: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ ఓటమి.. దిగజారిన కెప్టెన్ కోహ్లీ ర్యాంక్..
Virat Kohli
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 10, 2021 | 4:15 PM

Virat Kohli Rank : ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ తాజాగా విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఓటమి భారంతో ఉన్న కోహ్లీకి మరో పెద్ద దెబ్బ తగిలింది. ఓ స్థానం కోల్పోయి ఐదో ర్యాంకుకు పడిపోయాడు కోహ్లీ. భారత్‌తో తొలి టెస్టులో డబుల్‌ సెంచరీతో విజృంభించిన ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌(218) రెండు స్థానాలను మెరుగుపరచుకున్నాడు. నాలుగో ర్యాంకు నుంచి మూడో ర్యాంకును దక్కించుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ కూడా ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకుకు పడిపోయాడు.

న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విలియమ్సన్‌, రూట్‌ మధ్య కేవలం 36 పాయింట్ల వ్యత్యాసం ఉంది. అలాగే రెండో స్థానంలో ఉన్న స్టీవ్‌ స్మిత్‌..రూట్‌ కన్నా 8 పాయింట్లు ముందంజలో ఉన్నాడు. పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌(6 స్థానం), బెన్‌స్టోక్స్‌(9 స్థానం) చెరో ర్యాంకు మెరగుపరచుకున్నారు. భారత టెస్టు స్పెషలిస్ట్‌ చెతేశ్వర్‌ పుజారా ఒక స్థానం కోల్పోయి ఏడో ర్యాంకుకు పడిపోయాడు. చెన్నై టెస్టులో రిషబ్‌ పంత్‌ మినహా భారత బ్యాట్స్‌మెన్‌ పరుగులు సాధించడంలో విఫలమైన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

Karthika Deepam : అచ్చతెలుగు ఆడబడుచుగా ఆదరణ సొంతం చేసుకున్న కార్తీక దీపం అత్త సౌందర్య.. బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే!..

అదిరిపోయే పాలసీ.. రోజుకు రూ. 120 పెట్టుబడి పెడితే.. రూ. 27 లక్షలు పొందొచ్చు.. వివరాలు ఇవే..