IPL Title : ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ నుంచి చైనా మొబైల్​ దిగ్గజం తప్పుకుంటే.. పోటో పడుతున్న దేశీ కంపెనీలు ఇవే..

ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ నుంచి చైనా మొబైల్​ దిగ్గజం వివో వైదొలగాలనుకుంటోంది. ఇప్పటికే 2020కి గాను బీసీసీఐతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఈ సంస్థ..

IPL Title : ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ నుంచి చైనా మొబైల్​ దిగ్గజం తప్పుకుంటే.. పోటో పడుతున్న దేశీ కంపెనీలు ఇవే..
Follow us

|

Updated on: Feb 10, 2021 | 9:13 AM

IPL Title Sponsorship : ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి చైనా కంపెనీ తప్పుకునున్నట్లేనా..? ఇక ఆ చైనా మొబైల్ దిగ్గజం వివో టైటిల్ కనిపించదా..? కంపెనీలకు టైటిల్​ హక్కులు వదులుకున్నట్లేనా..? ఇలాంటి ప్రశ్నల చిక్కుముడి వీడనుంది. ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ నుంచి చైనా మొబైల్​ దిగ్గజం వివో వైదొలగాలనుకుంటోంది. ఇప్పటికే 2020కి గాను బీసీసీఐతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఈ సంస్థ.. ఆసక్తి ఉన్న కంపెనీలకు టైటిల్​ హక్కులు బదిలీ చేయాలని చూస్తోంది.

ఈ చైనా మొబైల్ దిగ్గజంకు 2023 వరకు ఐపీఎల్ టైటిల్​స్పాన్సర్​షిప్​ హక్కులు కలిగి ఉంది. అంటే.. మరో మూడు పర్యాయాల హక్కులు కలిగివుంది. అయితే.. గల్వాన్ లోయలో ఉద్రిక్తతల కారణంగా దేశ ప్రజల్లో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత వ్యక్తమైంది.దీంతో 2020 సంవత్సరానికి మాత్రం బీసీసీఐ, వివోలు భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి.

ఇప్పుడు వివో ఐపీఎల్‌కు పూర్తిగా దూరం కావాలనుకుంటోంది. ఆసక్తి ఉన్న కంపెనీలకు టైటిల్​ హక్కులను అప్పగించాలని ఆ చైనా మొబైల్ కంపెనీ ఆలోచన చేస్తోంది. ఈ స్పాన్సర్​షిప్​ హక్కుల కోసం ఇప్పటికే కొన్ని దేశీయ కంపెనీలు ఆ సంస్థతో సంప్రదింపులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా టైటిల్ హక్కులు దక్కించుకునేందుకు డ్రీమ్​11, అన్​అకాడమీ వంటి కంపెనీలు పోటీలో ఉన్నట్లుగా సమాచారం. గత ఏడాది దుబాయి వేదికగా జరిగిన ఐపీఎల్-13 హక్కులను డ్రీమ్​11 రూ.222 కోట్లు చెల్లించి స్పాన్సర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.