Interesting Test Match: 117 ఏళ్ల క్రితం క్రికెట్‌ చరిత్రలో ఓ అద్భుతం జరిగింది.. ఆ మ్యాచ్‌ విశేషాలేంటో మీరూ తెలుసుకోండి..

Whole Team All Out For 15 Runs 1904: క్రికెట్‌ అంటేనే అద్భుతాలకు నెలవు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొని ఉంటుంది కాబట్టే క్రికెట్‌ చూడడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంటారు. ఇక క్రికెట్‌ చరిత్రను గమనిస్తే...

Interesting Test Match: 117 ఏళ్ల క్రితం క్రికెట్‌ చరిత్రలో ఓ అద్భుతం జరిగింది.. ఆ మ్యాచ్‌ విశేషాలేంటో మీరూ తెలుసుకోండి..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 09, 2021 | 9:01 PM

Whole Team All Out For 15 Runs 1904: క్రికెట్‌ అంటేనే అద్భుతాలకు నెలవు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొని ఉంటుంది కాబట్టే క్రికెట్‌ చూడడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంటారు. ఇక క్రికెట్‌ చరిత్రను గమనిస్తే ఇలాంటి అద్భుతాలు ఎన్నో దర్శనమిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి.. 1904లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఒక దేశీయ టెస్ట్‌ మ్యాచ్‌. వివరాల్లోకి వెళితే.. అది 1904, ఫిబ్రవరి 9.. ఆస్ట్రేలియాలో విక్టోరియా, ఎంసిసి జట్ల మధ్య ఫస్ట్‌ క్లాస్‌ టెస్ట్‌ మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌లో భాగంగా.. మొదట బ్యాటింగ్‌ మొదలు పెట్టిన విక్టోరియా జట్టు 248 పరుగుల వద్ద అలౌట్‌ అయ్యింది. ఇక అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన ఎంసిసి పది వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఇలా విక్టోరియా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 51 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

కేవలం 15 పరుగులకే..

51 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విక్టోరియా జట్టు భారీ స్కోరు చేస్తుందని అంతా భావించారు. కానీ ఇక్కడే మ్యాజిక్‌ జరిగింది. ఎంసిసి బౌలర్లు రోడ్స్‌, ఆర్నాల్డ్‌ విధ్వంసకర బౌలింగ్‌ ముందు విక్టోరియా జట్టు కుప్పకూలింది. కేవలం 15 పరుగులకే జట్టు అలౌట్‌ అయ్యింది. ఇదంతా జరిగింది కేవలం 45 నిమిషాల్లోనే కావడం గమనార్హం. ఇక 67 పరుగుల లక్ష్యంతో మ్యాచ్‌ ప్రారంభించిన ఎంసిసి జట్టు.. కేవలం రెండు వికెట్ల నష్టానికే లక్ష్యాన్ని చేధించి సంచలన విజయం సాధించింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో..

ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యల్పంగా నమోదైన స్కోర్‌ విషయానికొస్తే.. 1955 లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో, న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్‌పై కేవలం 26 పరుగులకే ఆలౌట్ అయింది. 2004 సంవత్సరంలో, జింబాబ్వే జట్టు శ్రీలంకపై 35 పరుగులకే ప్యాకప్‌ అయ్యింది. ఇక శ్రీలంక, నెదర్లాండ్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కేవలం 39 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఇక 1810లో బిఎస్‌ జట్టు ఇంగ్లాండ్‌పై కేవలం 6 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.

Also Read: వికెట్ తీయలేదు, క్యాచ్ పట్టలేదు.. అనూహ్యంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పొందాడు.. ఆ బౌలర్ ఎవరంటే.!