Weight Loss Drug: బరువు తగ్గించే అద్భుత ఔషధం.. ఇప్పటివరకు చూడలేదంటున్న శాస్త్రవేత్తలు.. పరిశోధనలో ఏం తేలిందంటే..?
Weight Loss Medicine: ఊబకాయం.. స్థూలకాయం సమస్య మిమ్మల్ని వెంటాడుతుందా.. బరువు తగ్గడానికి విపరీతమైన పాట్లు పడుతున్నారా.. డైట్లు ఫాలో అయినా.. వర్కవుట్లు..
Weight Loss Medicine: ఊబకాయం.. స్థూలకాయం సమస్య మిమ్మల్ని వెంటాడుతుందా.. బరువు తగ్గడానికి విపరీతమైన పాట్లు పడుతున్నారా.. డైట్లు ఫాలో అయినా.. వర్కవుట్లు చేసినా ఫలితం లేకుండా పోతుందా.. అయితే మీలాంటి వారందరికీ గుడ్ న్యూస్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుత కాలంలో చాలామంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గేందుకు చాలా రకాల డ్రగ్స్ మార్కెట్లోకి వచ్చాయి.. అలాంటి వాటి వల్ల సైడ్‌ఎఫెక్ట్ తప్ప ఫలితం లేదని నిరూపితమైంది. బారియాట్రిక్ సర్జరీతో కూడా బరువు తగ్గవచ్చు. అయినప్పటికీ వ్యాయామం, అహార అలవాట్లు క్రమం తప్పకుండా పాటించాల్సిందే. ఈ క్రమంలో బరువును వేగంగా తగ్గించే డ్రగ్ అందుబాటులో ఉందని ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బరువు తగ్గడానికి సహాయపడుతున్న ఇలాంటి మెడిసెన్‌ను ఇప్పటివరకు ప్రపంచంలో చూడలేదంటూ వెల్లడించారు.
2వేల మందిపై పరిశోధన.. ఈ క్రమంలో ఇటీవల శాస్ర్తవేత్తలు జరిపిన రిసెర్చ్‌లో అనతీకాలంలోనే బరువు తగ్గేందుకు ఓ డ్రగ్ దొహదపడింది. ఈ పరిశోధన 16 దేశాల్లోని 2వేల మందిపై జరిగింది. టైప్ 2 డయాబెటిక్‌కు పనిచేసే సెమాగ్లుటైడ్ డ్రగ్‌ను వారికి ఇచ్చారు. వారానికి ఒక మోతాదు చొప్పున 68వారాలు వారికి ఇచ్చారు. దీంతో డ్రగ్ తీసుకున్న వారి శరీరం బరువు 14.9 శాతం తగ్గిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాంకుడా 30 శాతం మందికి 20 శాతం చొప్పున బరువు తగ్గింది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించారు.
భిన్నంగా శాస్త్రవేత్తల అభిప్రాయాలు.. కాగా ఈ పరిశోధనను చాలా మంది శాస్త్రవేత్తలు సమర్థిస్తుంటే.. పలువురు వ్యతిరేకిస్తున్నారు. వేగంగా బరువును తగ్గించే ఇలాంటి డ్రగ్‌ను ఇంతవరకు చూడలేదని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఇలా బరువు ఒకేసారి తగ్గడం వల్ల అనర్థాలు ఏర్పడతాయని.. అహార అలావాట్లు, వ్యాయమం బరువును నియంత్రణలో ఉంచుతుందని పేర్కొంటున్నారు.
Also Read: