కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఆరోగ్యశాఖ రూ.6,000..? తప్పుడు వార్తగా తేల్చిన పీఐబీ
ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి రూ .4,000-6,000 కు అందిస్తోందనే పుకారు షికార్లు చేశాయి. ఈ వార్తల్లో నిజం లేదని పీఐబీ స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ యుద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కేవలం 26 రోజుల్లో 70 లక్షలకు పైగా టీకాలు వేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా కోవిడ్ టీకా వేసిన దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకు మొత్తంగా 70,17,114 మందికి వ్యాక్సిన అందించగా, 57,05,228 మంది ఆరోగ్య కార్యకర్తలు, 13,11,886 మంది ఫ్రంట్‌లైన్ కార్మికులు టీకా తీసుకున్నారు. ఇక, ఇప్పటివరకు మొత్తం 1,43,056 సెషన్‌ల్లో వ్యాక్సిన ప్రక్రియ పూర్తి అయ్యింది.
ఇదిలావుంటే , ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి రూ .4,000-6,000 కు అందిస్తోందనే పుకారు షికార్లు చేశాయి. అయితే, దీనిపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి పీఐబీ ఫాక్ట్ చెక్ కూడా ఈ వాదనను తిరస్కరించింది ‘mohfw.xyz’ వెబ్‌సైట్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లా వ్యవహరించి తప్పుడు వార్తను ప్రచురించిందని తేల్చింది. వెబ్‌సైట్ నకిలీదిగా పేర్కొంది.
A website ‘https://t.co/SIgT5rr7w1‘ is impersonating the official website of Ministry of Health & Family Welfare and is claiming to offer #COVID19Vaccine for ₹ 4000-6000#PIBFactCheck: This is a #FAKE website. pic.twitter.com/vdMwA2PsSR
— PIB Fact Check (@PIBFactCheck) February 11, 2021