ఉత్కంఠ రేపుతున్న మరణం మూవీ టీజర్.. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందంటున్న ప్రముఖ ప్రొడ్యూసర్..

Maranam Movie Teaser: శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన

ఉత్కంఠ రేపుతున్న మరణం మూవీ టీజర్.. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందంటున్న ప్రముఖ ప్రొడ్యూసర్..
uppula Raju

|

Feb 12, 2021 | 7:11 PM

Maranam Movie Teaser: శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హార్రర్ సినిమా ‘మరణం’. ఈ సినిమా టీజర్‌ను అగ్ర నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. సినిమాలో పని చేసిన దర్శకుడు హీరో వీర్ సాగర్‌కి హీరోయిన్ శ్రీ రాపాకకి మరియు సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌కి మంచి భవిష్యతు ఉంటుందని ఆశీర్వదించారు. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని కితాబిచ్చారు.

హార్రర్ చిత్రాల్లో మంచి కంటెంట్ ఉంటే, సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని, మంచి కథ కుదిరితే వీర్ సాగర్ మరియు శ్రీ రాపాక కాంబినేషన్‌లో మరో సినిమా చేస్తానంటూ చెప్పుకొచ్చారు” దర్శకుడు, హీరో వీర్ సాగర్ మాట్లాడుతూ.. “సి కళ్యాణ్ గారు నాకు గాడ్ ఫాదర్ లాంటి వారని, కష్టాల్లో ఉన్నపుడు నాకు సహాయం చేశారని, జీవితాంతం కళ్యాణ్ గారికి రుణపడి ఉంటానన్నారు. అనంతరం శ్రీ రాపాక మాట్లాడుతూ.. కళ్యాణ్ గారు మా లాంటి చిన్న నటి నటులు, టెక్నిషన్స్‌కి గాడ్ ఫాదర్. నేను కథను నమ్ముతాను. వీర్ సాగర్ చాలా హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. సి. కళ్యాణ్ గారికి కూడా సినిమా కచ్చితంగా నచ్చుతుందని పేర్కొన్నారు.


Jathi Ratnalu Movie : జాతి రత్నాలు’ టీజర్ రిలీజ్.. నవ్వులు పంచుతున్న స్టార్ కమెడియన్స్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu