AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chammak Chandra: ఇంటి అద్దె కట్టలేని స్టేజ్ నుంచి కోట్లు సంపాదించే స్టేజ్ కు వెళ్లిన జబర్దస్త్ కమెడియన్..

బుల్లితెరపైఁ సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ చూస్తున్న వారికి చమ్మక్ చంద్ర పేరుని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చమ్మక చంద్ర ఆ షోని వదిలి అదిరింది షోకు వెళ్లినా ఇప్పటికీ ఆ షో చూసే వారు ఒక్కసారైనా చమ్మక చంద్రను తలచుకుంటారు...

Chammak Chandra: ఇంటి అద్దె కట్టలేని స్టేజ్ నుంచి కోట్లు సంపాదించే స్టేజ్ కు వెళ్లిన జబర్దస్త్ కమెడియన్..
Surya Kala
|

Updated on: Feb 12, 2021 | 7:40 PM

Share

Jabardasth Fame Chammak Chandra: బుల్లితెరపైఁ సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ చూస్తున్న వారికి చమ్మక్ చంద్ర పేరుని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చమ్మక చంద్ర ఆ షోని వదిలి అదిరింది షోకు వెళ్లినా ఇప్పటికీ ఆ షో చూసే వారు ఒక్కసారైనా చమ్మక చంద్రను తలచుకుంటారు… అంటే అర్ధం చేసుకోవాలి ఆ షో పై చమ్మక చంద్ర ప్రభావం ఏ రేంజ్ లో ఉందొ.. చమ్మక చంద్ర జీవితం తను ఎదిగిన విధానం నేటి యువతకి ఆదర్శం.. ఒకా నొక సమయంలో ఒక్క రూపాయి కోసం ఎంతో కష్టపడ్డానని తనే స్వయంగా చెప్పాడు… 13ఏళ్ళ వరకూ తినడానికి కూడా ఇబ్బంది పడిన రోజుల్లో కూడా నిరాశపడలేదని.. చాలా సార్లు చెప్పాడు చమ్మక చంద్ర.. ఒకానొక సమయంలో రూమ్ కి రెంట్ కట్టడానికి కూడా కష్టపడిన చంద్ర ఈ రోజు కోటి రూపాయలు విలువజేసే ఇంట్లో ఉంటున్నాడు.. అతని ఆస్తుల విలువ ఏమిటో తెలుసా..!

జబర్దస్త్ షో లోకి అడుగు పుట్టకముందు దాదాపు 13 ఏళ్ళు ఎంతో కష్టపడ్డానని తనకు లైఫ్ ఇచ్చింది బుల్లితెర జబర్దస్త్ షో అని చెబుతాడు. తాను పడిన ఆర్ధిక కష్టాల నుంచి గుర్తింపు వచ్చిన తర్వాత కెరీర్ తో పాటు ఆర్ధికంగా కూడా పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నాడు. ఓ వైపు బుల్లితెర మీద షో లు చేస్తున్నాడు.. మరోవైపు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే ..వివిధ షోలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఇక జబర్దస్త్ కామెడీ షోలో అందరికంటే ఎక్కువ ఆస్తులు చమ్మక్ చంద్ర కె ఉన్నాయని అప్పట్లో నాగబాబు కూడా చెప్పాడు. ఆర్ధికంగా సెటిల్ కావడానికి పక్కా ప్లానింగ్‌తో చాలా బాగా సంపాదించుకున్నాడట.

హైదరాబాద్‌లోని మణికొండలో చంద్రకు సొంతిల్లు ఉంది. దాని విలువ కోటిపైనే ఉంటుంది. ఇక ఓ బిఎండబ్ల్యూ కారు కూడా ఉంది. ఇల్లుతో పాటు హైదరాబాద్ లో కొన్ని చోట్ల ఆస్తులు కూడా కొన్నాడట చంద్ర.. ఇక సొంత ఊరైన నిజామాబాద్ లో కూడా ఆస్తులను కొన్నాడని అవి ఇప్పుడు మంచి రేటు పలుకుతున్నాయని తెలుస్తోంది. జబర్దస్త్ షో చేస్తున్న సమయంలో హాయ్ పోయిడ్ యాక్టర్ చమ్మక చంద్ర అనేకాదు ఇక అదిరింది షో లో కూడా ఒకో స్కిట్ కు దాదాపు 4 లక్షలు తీసుకున్నాడని టాక్. మరోవైపు సినిమాల్లో అనేక అవకాశాలు అందుకుంటున్నాడు.. దీంతో కెరీర్ ను బ్యాలెన్స్ ను చేస్తూ బాగానే సంపాదించాడు చమ్మక చంద్ర అనే టాక్. అంతేకాదు.. ఎన్ని కష్టాలు పడినా కెరీర్ లో ఎదిగిన విధానం నేటి తరానికి ఆదర్శం అని అంటారు.

Also Read:

సోషల్ మీడియాలో కిడ్నీని అమ్మకానికి పెట్టిన ఆర్టీసీ ఉద్యోగి.. కారణమదేనంటూ..

నాన్ వెజ్ ప్రియుల కోసం … రుచికరమైన నిల్వ చేసుకునే చికెన్ పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..!