kidney on sale: సోషల్ మీడియాలో కిడ్నీని అమ్మకానికి పెట్టిన ఆర్టీసీ ఉద్యోగి.. కారణమదేనంటూ..

Corona Effect: కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. ఆర్థికంగా ఎంతోమంది సామాన్యులు నలిగిపోయారు. తాజాగా ఇందుకు అద్దం..

kidney on sale: సోషల్ మీడియాలో కిడ్నీని అమ్మకానికి పెట్టిన ఆర్టీసీ ఉద్యోగి.. కారణమదేనంటూ..
Follow us

|

Updated on: Feb 12, 2021 | 7:27 PM

Corona Effect: కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. ఆర్థికంగా ఎంతోమంది సామాన్యులు నలిగిపోయారు. తాజాగా ఇందుకు అద్దం పట్టే ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. కరోనా సంక్షోభం కారణంగా ప్రభుత్వ సంస్థలు మొదలు ప్రైవేటు సంస్థల వరకు తమ ఉద్యోగులకు జీతాల్లో కోతలు విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కోతల కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. తాజాగా కర్ణాటక ఆర్టీసీ సంస్థలో పని చేస్తున్న ఓ ఉద్యోగి ఆర్థిక సమస్యల నేపథ్యంలో తన కిడ్నీని అమ్మకానికి పెట్టాడు. ఆ మేరకు పేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. జీతం తగ్గించడం వల్ల రోజూవారీ ఖర్చులను భరించలేకపోతున్నామని, అందుకే తన కిడ్నీని అమ్మాలని నిర్ణయించుకున్నట్లు ఎన్ఈకేఆర్టీసీ సంస్థలో కండక్టర్‌ గా పని చేస్తున్న హనుమంత్(38) తెలిపారు. కోతలతో కూడిన జీతం వల్ల తన కుటుంబం తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

‘నేను రవాణా సంస్థలో కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు వస్తున్న కోతలతో కూడిన జీతం ఏమాత్రం సరిపోవడం లేదు. రేషన్, ఇంటి అద్దెకు చెల్లించడానికి వచ్చిన జీతం సరిపోవడం లేదు. ఆ కారణంగా నా కిడ్నీని అమ్మాలని నిర్ణయించుకున్నాను. ఆసక్తి ఉన్నవాళ్లు నా ఫోన్ నెంబర్‌కు కాల్ చేయండి.’ అంటూ హనుమంతు తన ఫోన్ నెంబర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి నార్త్ ఈస్ట్ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ సంబంధించిన ఫేస్‌బుక్ పేజీని ట్యాగ్ చేశాడు. దాంతో పలువురు మీడియా ప్రతినిధులు ఆయన్ను సంప్రదించగా.. తన గోడును వెల్లబోసుకున్నాడు. సంస్థ ఇచ్చే జీతంతో ఇంటి అద్దె చెల్లించడం, ఇంట్లో కిరాణా సామాగ్రి కొనుగోలు చేయడం, పిల్లల చదువులు భారంగా మారయని హనుమంతు బోరున విలపించాడు. అయితే, దీనిపై ఎన్ఈకేఆర్టీసీ సంస్థ అధికారులు స్పందించారు. హనుమంతు రెగ్యూలర్‌గా ఉద్యోగానికి రాకపోవడం వల్లే అతనికి జీతం తక్కువగా వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ విషయమై అతనికి తాము చాలా సార్లు హెచ్చరించామని కూడా చెప్పారు.

Also read:

India Vs England 2021: ‘ఆ విషయం నేను చెప్పను’.. మీడియా ప్రతినిధులకు షాక్ ఇచ్చిన అజింక్యా రహానే..

చిత్తూరు ఎన్నికల్లో శ్రీలంక పంచాయితీ! సామాజిక గుర్తింపు కోసం లంక శరణార్థుల సుదీర్ఘ పోరాటం

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.