Rashmika: ట్రెండింగ్‌లో రష్మిక ‘టాప్ టక్కర్’… లక్షల వ్యూస్‌తో దూసుకెళుతోన్న ప్రైవేటు ఆల్బమ్..
Rashmika Top Tucker Song On Trending: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకెళుతోంది అందాల తార రష్మిక. ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా మారారు. బడా స్టార్ల సరసన..
Rashmika Top Tucker Song On Trending: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకెళుతోంది అందాల తార రష్మిక. ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా మారారు. బడా స్టార్ల సరసన నటిస్తూ బిజీగా మారింది. ఇక ఇటీవల బాలీవుడ్‌లోనూ నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ అందాల తార కేవలం సినిమాల్లోనే కాకుండా ప్రైవేటు ఆల్బమ్‌లోనూ తళుక్కుమంది. రష్మిక నటించిన ‘టాప్ టక్కర్’ అనే ప్రైవేటు వీడియో ఇటీవల విడుదలై వైరల్‌గా మారింది. బాలీవుడ్ హిప్ హాప్ సింగర్ బాద్షాతో చేతులు కలిసి చేసిన ఈ పాటలో రష్మిక ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. దేశీ లుక్‌లో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును క్లీన్ బోల్డ్ చేసిందనే చెప్పాలి. టీజర్‌తోనే అందరినీ ఆకర్షించిన ఈ వీడియో.. ఇప్పుడు ఫుల్ వీడియో నెట్టింట్లో హంగామా చేస్తోంది. ప్రస్తుతం ‘టాప్ టక్కర్’ పాట యూట్యూబ్ ట్రెండింగ్ నెం1 స్థానంలో కొనసాగుతోంది. విడుదల చేసిన కొద్ది సమయంలోనే ఈ వీడియో సుమారు 30 లక్షల వ్యూస్‌తో దూసుకెళుతోంది. ఇక రష్మిక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఒక తమిళ సినిమాతో పాటు తెలుగులో శర్వానంద్‌కు జోడిగా ‘ఆడవారు మీకు జోహర్లు’, అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘పుష్ప’తో పాటు బాలీవుడ్‌లో రెండు సినిమాల్లో నటిస్తోంది.