బిగ్ బాస్ 4 : ఇంటి నుంచి మెహబూబ్ ఔట్, అనుకున్నదే జరిగింది
విమర్శలు, ప్రశంసలు సంగతి పక్కనబెడితే బిగ్ బాస్ తెలుగు 4 రియాల్టీ షో విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ఇక ప్రతీవారం నామినేషన్స్ జరగడం..
విమర్శలు, ప్రశంసలు సంగతి పక్కనబెడితే బిగ్ బాస్ తెలుగు 4 రియాల్టీ షో విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ఇక ప్రతీవారం నామినేషన్స్ జరగడం.. వారంతంలో ఒకరు బయటికి వెళ్లడం నిరంతరం జరిగే ప్రక్రియే. అయితే ఎవరు బయటకు వెళ్తారు అనే విషయంపై మాత్రం వీక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అయితే ఒకరోజు ముందే ఎపిసోడ్ అయిపోతుంది కాబట్టి ఎవరు వెళ్లిపోబోతున్నారో ముందుగానే లీకు వీరుల ద్వారా తెలిసిపోతుంది. కాగా ఈ వారం నామినేషన్స్‌లో అభిజిత్, అరియానా, హారిక, మోనాల్, సోహైల్, మెహబూబ్ ఉన్నారు. ఇక అంచనాలకు తగ్గట్లుగానే మెహబూబ్‌ను ఇంటి నుంచి పంపించినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. చాలా వారాల నుంచి మెహబూబ్‌ను ఇంటికి పంపించాలని ప్రయత్నాలు జరిగాయి కానీ..సమయం కుదర్లేదు. ఇప్పుడు ఆప్షన్ లేకపోవడంతో అతడ్ని ఇంటికి పంపించేశారు. అంటే ఇకపై టాస్కుల వీరుడు బిగ్ బాస్ ఇంట్లో కనిపించడనమాట.
ఇక ఎలిమినేషన్ ప్రక్రియ విషయంపై అనుమానాలు అలానే ఉన్నాయి. ఓట్లు వేస్తున్నా కొందరు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారో తెలియడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా దేవీ నాగవల్లీ, కుమార్ సాయి విషయంలో వీక్షకులు బాగా హర్టయ్యారు. వారి ఎలిమినేషన్స్ తర్వాాత షో రేటింగ్ తగ్గింది. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన నిర్వాహకులు యాంకర్ సుమతో ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చెయ్యడం, అఖిల్ ను సీక్రెట్ రూమ్‌కి పంపించడం వంటివి చేశారు.
Also Read : ‘మా వింత గాధ వినుమా’ రివ్యూ : సిద్ధు మరోసారి ఆకట్టుకున్నాడా..మీరే చదవండి !