విహారయాత్రలో విషాదం… బ్రిడ్జిపై నుంచి నదిలో పడ్డ బస్సు.. ఐదుగురు దుర్మరణం..
విహారయాత్రకు బయలుదేరిన వారిని తీవ్ర విషాదం నింపింది. మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది.
విహారయాత్రకు బయలుదేరిన వారిని తీవ్ర విషాదం నింపింది. మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. సతారా జిల్లాలోని కరాడ్ పట్టణ సమీపంలో బస్సు బ్రిడ్జిపైనుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలవగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. విహారయాత్ర కోసం గోవాకు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితులందరూ నవీ ముంబైలోని వాషి నివాసితులుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.
పూణే-బెంగళూరు రహదారిపై ఉంబ్రాజ్ వద్ద శనివారం ఉదయం వేగంగా వెళ్తున్న బస్సుపై డ్రైవర్ రింకు సాహు నియంత్రణ కోల్పోయాడు. దాంతో బస్సు వంతెనపై నుంచి 40 అడుగుల కింద ఉన్న పొడి తారాలే నదిలో పడిపోయింది. దీంతో చాలా మంది ప్రయాణికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు ఉషా నాయర్ (40), మధుసూదన్ నాయర్ (42), ఆదిత్య నాయర్ (23), సజన్ నాయర్ (35), ఆరవ్ నాయర్ (3) గా పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌తో పాటు గాయపడిన వ్యక్తులను కరాడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్‌పై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద, మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.