Chicken Pickle Recipe: నాన్ వెజ్ ప్రియుల కోసం … రుచికరమైన నిల్వ చేసుకునే చికెన్ పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..!

తెలుగు వారికి పచ్చళ్లకు విడదీయరాని బంధం ఉంది.. ఇక వెజ్ ప్రియులకు ఆవకాయ, మాగాయ ఇలా అనేక రకాల నిల్వ పచ్చళ్ళు ఉంటాయి. అయితే మరి నాన్ వెజ్ ప్రియులకు కూడా నిల్వ పచ్చళ్ళు ఉంటె బాగుండు అనిపిస్తుంది.  కొనుక్కుని తిందాం అంటే చికెన్ పికిల్ ధర రోజు రోజుకీ ఓ రేంజ్ లో..

Chicken Pickle Recipe: నాన్ వెజ్ ప్రియుల కోసం ... రుచికరమైన నిల్వ చేసుకునే చికెన్ పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..!
Follow us
Surya Kala

|

Updated on: Feb 12, 2021 | 7:20 PM

Chicken Pickle Recipe: తెలుగు వారికి పచ్చళ్లకు విడదీయరాని బంధం ఉంది.. ఇక వెజ్ ప్రియులకు ఆవకాయ, మాగాయ ఇలా అనేక రకాల నిల్వ పచ్చళ్ళు ఉంటాయి. అయితే మరి నాన్ వెజ్ ప్రియులకు కూడా నిల్వ పచ్చళ్ళు ఉంటె బాగుండు అనిపిస్తుంది.  కొనుక్కుని తిందాం అంటే చికెన్ పికిల్ ధర రోజు రోజుకీ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. అయితే తాజగా మనం ఈరోజు కోడి మాసం తో నిల్వ పచ్చడి తయారీ నేర్చుకుందాం..

కావాల్సిన పదార్ధాలు: కోడి మాసం మసాలా పొడి (రెడీమేడ్ గా దొరికేది వేసుకోవచ్చు) లేదా (మసాలా తయారీకి ;లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు.. వీటిని నూనెల లేకుండా నార్మల్ గానే వేపించుకుని పొడి చేసుకోవాలి) అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు… తెలుగు వారికి పచ్చళ్లకు నిమ్మ పులుసు… నాలుగు కప్పులు పసుపు… ఒక టీస్పూను వెల్లుల్లి… ఒకటి నూనె… ఒక కిలో పచ్చికారం… రుచికి సరిపోయినంత ధనియాల పొడి కొంచెం

తయారీ విధానం : ముందుగా కోడి మాంసాన్ని శుభ్రం చేసి ముక్కలుగా కోసుకుని కుక్కర్ లో కొంచెం నీరు .. అల్లం వెల్లులి పేస్ట్ , కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి.. అనంతరం ఒక కళాయిలో నూనె పోసి, బాగా కాగిన తరువాత అనంతరం ఆ ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి. అలా వేగిన ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి ఆ వేడి వేడి ముక్కలమీద కారం.. గరం మసాలా పొడి కొంచెం పసుపు ఉప్పు వేసి అనంతరం కాగిన నూనె పోయాలి.

తరవాత కొంచెం నూనె లో నిమ్మరసం వేసి కొంచెం వేడి చేసి మాంసం ముక్కలపై వేసి కలపాలి. ఈ మిశ్రమానికి కర్వేపాకు , వెల్లుల్లి, ఎండు మిర్చి వేసి పోపు పెట్టాలి.. అనంతరం ఈ మిశ్రమాన్ని నీరు తగలకుండా జాడీలో భద్రపరచుకోవాలి. ఇలా తయారు చేసిన ఆవకాయ రెండు మూడు నెలల వరకు నిలువ వుంటుంది.

Also Read:

కొడుకులు పోయారు.. మనవరాలి కోసం ముసలోడి తాపత్రయం… ఆటోలోనే అన్నీ.. భేష్ తాతా!

ట్రెండింగ్‌లో రష్మిక ‘టాప్ టక్కర్’… లక్షల వ్యూస్‌తో దూసుకెళుతోన్న ప్రైవేటు ఆల్బమ్..