Cyclops Puppy : ఒంటి కన్ను, రెండు నాలుకలతో వింత కుక్క జననం.. తల్లి తిన్న ఆహారమే కారణం అంటున్న నిపుణులు
సృష్టిలో ఎన్నో వింతలు విశేషాలు.. ఇది వరకు ఐతే మీడియా ఇంత అందుబాటులో లేకపోవడంతో ఎక్కడ ఏమి జరిగినా ప్రపంచానికి పెద్దగా తెలిసేవి కావు.. తెలిసినా చాలా ఆలస్యంగా తెలిసేవి.. అయితే ఇప్పుడు అరచేతిలో ప్రపంచం స్మార్ట్ ఫోన్లతో అందుబాటులో ఉంది. దీంతో ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో అందరికీ..
Cyclops Puppy : సృష్టిలో ఎన్నో వింతలు విశేషాలు.. ఇది వరకు ఐతే మీడియా ఇంత అందుబాటులో లేకపోవడంతో ఎక్కడ ఏమి జరిగినా ప్రపంచానికి పెద్దగా తెలిసేవి కావు.. తెలిసినా చాలా ఆలస్యంగా తెలిసేవి.. అయితే ఇప్పుడు అరచేతిలో ప్రపంచం స్మార్ట్ ఫోన్లతో అందుబాటులో ఉంది. దీంతో ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో అందరికీ తెలుస్తుంది. తాజాగా ఓ పెంపుడు కుక్కకి వింత కుక్కపిల్ల జన్మించింది.
సాధారణ కుక్కపిల్ల మాదిరిగా కాకుండా విచిత్ర రూపంలో పుట్టింది. సర్వసాధారణంగా కుక్కకు రెండు కళ్లు, ముక్కు, ఒక నాలుక.. ఉంటాయి. ఫిలిప్పీన్స్ లో ఓ పెంపుడు కుక్కకు ఒంటి కన్ను, రెండు నాలుకలతో బుజ్జి కుక్కపిల్ల పుట్టింది. వివరాల్లోకి వెళ్తే..
ఫిలిప్పీన్స్ లోని అక్లాన్ ప్రావిన్స్ కు చెందిన అమీ డి మార్టిన్ అనే వ్యక్తి ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే ఆ కుక్క ఈనెల 5 న రెండు కుక్కలకు జన్మనిచ్చింది. అందులో మొదటి పుట్టిన కుక్కపిల్ల నార్మల్ గా ఉంది.. అయితే రెండో సారి పుట్టిన కుక్కపిల్ల మాత్రం వింతగా పుట్టింది. ఆ కుక్క పిల్లకు ఒకటే కన్ను అదీ నుదురు మధ్యలో ఉంది, ఇక రెండు నాలుకలున్నాయి. అంతేకాదు ఆ కుక్కపిల్లకు ముక్కులేదు. దీంతో అది నోటితోనే ఊపిరిపీల్చుకుంటుంది.
CYCLOPS PUPPY? ?️
A puppy shocked its owners after it was born with a single eye on the center of its forehead in Tangalan, Aklan on February 6, 2021. (Photos courtesy of Amie de Martin, Boracay News Network) pic.twitter.com/jGeXlHjIZS
— The Philippine Star (@PhilippineStar) February 8, 2021
అయితే తల్లి పాలు తాగడానికి ఈ కుక్కపిల్ల ఇబ్బంది పడుతుంటే ఆ యజమాని ఆ కుక్కపిల్లను దగ్గరతీసుకుని పాలు పట్టించాడు. అది ఎలా పుట్టినా అది బతకాలని కోరుకున్నాడు. అయితే ముక్కు లేకపోవడంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడి అది మరణించింది. అయితే . మెదడును అభివృద్ధిని ప్రభావితం చేసే జన్యులోపాలు లేదా తల్లి కుక్క గర్భవతిగా ఉన్న సమయంలో ఏదైనా విష ఆహారం తిని ఉండడంతో కుక్క ఇలా జన్మించి ఉంటుందని పశువైద్య నిపుణులు చెప్పారు. అంతేకాదు ఈ కుక్కపిల్ల సైక్లోపియా అనే అరుదైన వ్యాధితో మరణించిందని తెలిపారు. అయితే ఆ కుక్కపిల్ల యాజమాని మరణించిన కుక్క దేహాన్ని గాజు పెట్టెలో భద్రపరిచారు.
Also Read: