AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

President Joe Biden: వైట్ హౌస్ లాన్స్ లో..వేలంటైన్ డే నాడు, జో బైడెన్, జిల్ ‘ప్రేమ గుర్తులు’, యూనిటీ, లవ్

ప్రతి ఏటా ఫిబ్రవరి 14.. వేలంటైన్స్ డే..ప్రేమికుల రోజు.. ప్రేమ పక్షుల కబుర్లు, కంటున్న కలలు, మురిపాల ఊసులు. కాలమన్నది తెలియకుండా చకచకా నడిచిపోయే తీపి గుర్తులకు..

President Joe Biden: వైట్ హౌస్ లాన్స్ లో..వేలంటైన్ డే నాడు, జో బైడెన్, జిల్ 'ప్రేమ గుర్తులు',  యూనిటీ,  లవ్
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 13, 2021 | 1:06 PM

Share

 President Joe Biden:  ప్రతి ఏటా ఫిబ్రవరి 14.. వేలంటైన్స్ డే..ప్రేమికుల రోజు.. ప్రేమ పక్షుల కబుర్లు, కంటున్న కలలు, మురిపాల ఊసులు. కాలమన్నది తెలియకుండా చకచకా నడిచిపోయే తీపి గుర్తులకు ఇది స్పెషల్ ‘గిఫ్ట్ డే’ ! ప్రేమను వ్యక్తపరచడానికి ప్రత్యేకంగా ఒక రోజంటూ లేకపోయినా ఏ నాడో జరిగిపోయిన ఓ యధార్థ ఘటనకు ఇది ప్రతిరూపం కూడా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య జిల్.. ఈ సందర్భంగా తమ దేశ ప్రజలకు గ్రీటింగ్స్ తెలిపారు. యూనిటీ,  హోప్, లవ్ అని రాసి ఉన్న రెడ్ హార్ట్ లతో కూడిన భారీ పింక్ పోస్టర్లవంటి వాటిని తమ వైట్ హౌస్ లాన్స్ లో ఏర్పాటు చేశారు. జిల్..తన భర్త బైడెన్ తోను, తాము ప్రేమతో పెంచుకుంటున్నరెండు జర్మన్ శునకాలు..ఛాంప్, మేజర్ తోను ఇక్కడికి సర్ ప్రైజ్ విజిట్ చేశారు.

ఈ కరోనా పాండమిక్ లో ప్రతి అమెరికన్ వ్యక్తీ కొంత నిరాసక్తంగా ఉండవచ్చునని, వేలంటైన్ డే ని మునుపటిలా ఉత్సాహంగా జరుపుకోలేకపోవచ్చ్చునని జిల్ అన్నారు. కానీ కొద్దిపాటి జాయ్,లిటిల్ హోప్ ఉండాల్సిందే అన్నారామె. ఇక ఇది ఫస్ట్ లేడీ ఫేవరేట్ డే అని బైడెన్ మీడియాతో వ్యాఖ్యానించారు. తాను ఉపాధ్యక్షునిగా ఉన్నప్పుడు తన కార్యాలయంలోని ప్రతి కిటికీ అంతా హృదయాల చిహ్నాలతో కూడిన పోస్టర్లతో జిల్ నింపేసిందని ఆయన తెలిపారు. ఈ కరోనా కాలంలో అమెరికన్లకు మీరు ఎలాంటి ‘లవ్ స్టోరీ’ ని ఇవ్వాలనుకుంటున్నారన్న ప్రశ్నకు ఆయన.. ఆశ అన్నది ఉంటుందని, ప్రతివారూ ఈ తరుణంలో బలంగా, శక్తిమంతంగా ఉండాలనే తాను కోరుతున్నానని చెప్పారు. ఏమైనా అమెరికాలో ఇంకా కోవిడ్ తన ప్రతాపాన్ని చూపుతున్న సమయంలో అమెరికన్లు మునుపటిలా ఈ ప్రేమికుల రోజును ఉత్సాహంగా జరుపుకునేందుకు విముఖంగా ఉన్నారన్నది స్పష్టం.

Also Read:

Covid Vaccine Second Dose: 28రోజుల అనంతరం నేడు రెండో డోసు వ్యాక్సినేషన్, ఎయిమ్స్ చీఫ్, నీతి ఆయోగ్ సభ్యుడు కూడా !

Uttar Pradesh Accident : వెదర్ ఎఫెక్ట్.. యూపీ ఘోర రోడ్డు ప్రమాదం.. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ వేపై ట్రక్కును ఢీకొన్న కారు..