India Corona: కరోనాతో గత 24 గంటల్లో 103 మంది మృతి.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

India Corona: గడిచిన 24 గంటల్లో 7,43,614 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,143 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే

India Corona:  కరోనాతో గత 24 గంటల్లో 103 మంది మృతి.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
Coronavirus Updates
Follow us
uppula Raju

|

Updated on: Feb 13, 2021 | 11:08 AM

India Corona: గడిచిన 24 గంటల్లో 7,43,614 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,143 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే 30 శాతం పెరుగుదల కనిపించింది. నిన్న 103 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు 1.08 కోట్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..1,55,550 మరణాలు సంభవించాయి. దేశంలో ప్రస్తుతం 1,36,571 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 1.25 శాతానికి తగ్గింది. మొత్తంగా కరోనాను జయించిన వారి సంఖ్య 1.06 కోట్లకు పైబడింది.

నిన్న ఒక్కరోజే 11,395 మంది వైరస్‌ నుంచి కోలుకోగా..ఆ రేటు 97.32 శాతానికి పెరిగింది. అయితే దేశవ్యాప్తంగా జనవరి 16న కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. 28 రోజులు పూర్తికావడంతో మొదటి రోజున టీకా తీసుకున్నవారికి నేడు రెండో డోసు అందించనున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, నీతీ ఆయోగ్‌ ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మొదటి రోజు టీకా తీసుకున్నవారి జాబితాలో ఉన్నారు. వారు ఈ రోజు రెండో డోసు వేయించుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 12న 4,62,637 మందికి కేంద్రం కరోనా టీకాలు పంపిణీ చేసింది. దాంతో నిన్నటివరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 79,67,647కి చేరింది.

Telangana Corona: తెలంగాణలో పూర్తిగా తగ్గుముఖం పట్టిన కరోనా.. మరణాలు నిల్‌.. కొత్తగా ఎన్ని కేసులంటే..