AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghee Uses: నెయ్యితో ఇలాంటి లాభాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా..? ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి..

నెయ్యిని ఆహారంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థ బాగుపడుతుంది. శరీరానికి సరిపడ మంచి పోషకాలు లభిస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే నెయ్యితో నిద్రలేమి సమస్యను కూడా...

Ghee Uses: నెయ్యితో ఇలాంటి లాభాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా..? ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి..
Narender Vaitla
|

Updated on: Feb 12, 2021 | 6:02 PM

Share

Benefits Of Rubbing Ghee On The Soles Of Your Feet: మనలో చాలా మంది నిత్యం నెయ్యిని ఏదో రకంగా తీసుకుంటాము. కొందరు అన్నంలో వేసుకొని తింటే.. మరికొందరు స్వీట్‌లు, బ్రెడ్‌తో తింటుంటారు. నెయ్యిని ఆహారంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థ బాగుపడుతుంది. శరీరానికి సరిపడ మంచి పోషకాలు లభిస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే నెయ్యితో నిద్రలేమి సమస్యను కూడా తరిమికొట్టవచ్చని మీకు తెలుసా? నెయ్యి నిద్ర లేమిని తరిమి కొట్టమేంటని ఆశ్చర్యపోతున్నారా.? అయితే ప్రముఖ సెలబిట్రీ న్యూట్రిస్ట్ రుజుతా దివేకర్ చెప్పిన ఆసక్తికర విషయాలను తెలుసుకోవాల్సిందే.

మారుతోన్న జీవనశైలి కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ సమయం బస్సుల్లో, రైళ్లలో జర్నీ చేసి ఇంటికి చేరేవారు కాళ్లనొప్పులతో ఇబ్బందులు పడుతూ నిద్రకు దూరమవుతున్నారు. ఇలాంటి వారు ప్రతీరోజు నెయ్యితో అరికాళ్లు మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని రుజుతా చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా అరచేతిలోకి కొంత నెయ్యిని తీసుకొని దాన్ని అరికాళ్లకు పూర్తిగా రుద్దలి అనంతరం మంచిగా మసాజ్ చేయాలి. అరచేతితో.. అరికాలును మర్ధన చేయాలి. వేడిగా అనిపించేంత వరకు ఈ ప్రక్రియను రిపీట్ చేయాలి.

వినడానికి చాలా సింపుల్‌గా ఉన్న ఈ టెక్నిక్ ఎంతో బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల నొప్పులు తగ్గడంతో పాటు మంచి నిద్ర కూడా పడుతుందట. సరిపడ నిద్ర ఉంటే చాలా వరకు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని ప్రముఖ న్యూట్రిస్ట్ చెబుతున్నారు. ఒకవేళ నెయ్యి అందుబాటులో లేకుంటే కొబ్బరి నూనెను కూడా ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గురకపెట్టేవారు, రాత్రుళ్లు సరిగా నిద్రపట్టని వారు, అజీర్తితో బాధపడేవారికి మంచి పరిష్కారం దొరుకుంతని దివేకర్ చెబుతున్నారు. నెయ్యితో మసాజ్ చేసుకుంటే కలిగే లాభాలు ఎలాంటివో తెలుసుకున్నారు కదా.. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ సింపుల్ టెక్నిక్‌ను మీరూ ట్రై చేయండి మంచి ఫలితాలను పొందండి.

Also Read: Health Benefits: వేడి నీటితో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ తాగితే.. ఎలాంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చో తెలుసా?